1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 19-06-2025 Daily Astrology

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

Astrology
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిచయాలు బలపడతాయి. పనులు అనుకున్న విధంగా సాగవు. ఒత్తిడికి గురి కావద్దు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. దంపతులు ఏకాభిప్రాయానికి లాగలుగుతారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఓర్పు, పట్టుదలతో శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. కావలసిన ధనం అందుతుంది. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు విపరీతం. వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రసీదులు జాగ్రత్త ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. పట్టింపులకు పోవద్దు. లౌక్యంగా మెలగండి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు ముండకొడిగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. 
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోదైర్యంతో అడుగు ముందుకు వేస్తారు. కృషి ఫలించకున్నా శ్రమించామనే తృప్తి ఉంటుంది. ఏ విషయాన్ని తీవ్రంగా భావించవద్దు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త పనులు అప్పగించవద్దు. కొత్తవారితో జాగ్రత్త బెట్టింగ్‌ల జోలికి పోవద్దు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆత్మస్థైర్యంతో యత్నాలు సాగిస్తారు, పరిస్థితులు అనుకూలిస్తాయి. సమర్థతను చాటుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. నిలిపి వేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. దూర ప్రయాణం తలపెడతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పసులు సకాలంలో పూర్తి చేస్తారు. నగదు స్వీకరణలో జాగ్రత్త, అనవసర జోక్యం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంప్రదింపులు, కొలిక్కివస్తాయి. రుణవిముక్తులవుతారు. ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. 
 
ధనస్సు మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం
గ్రహస్థితి బాగుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. ఖర్చులు అధికం. ప్రముఖులకు సన్నిహితులవుతారు. కొత్తవారిని నమ్మవద్దు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. స్వయంకృషి తోనే కార్యం సాధిస్తారు. మీ ఓర్పు, పట్టుదలలే విజయానికి దోహదపడతాయి. ఖర్చులు సామాన్యం, ఆపన్నులకు సాయం చేస్తారు. మీ ప్రమేయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు. అన్ని విధాలా శుభమే జరుగుతుంది. ధైర్యంగా యత్నాలు సాగించండి. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహారానుకూలత ఉంది. సమయోచిత నిర్ణయం తీసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ధనసమస్యలెదురయ్యే సూచనలున్నాయి. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. దంపతుల మధ్య ఆకారణ కలహం సామరస్యంగా మెలగండి.
 
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు