1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 17-06-2025 Daily Astrology

17-06-2026 బుధవారం ఫలితాలు - వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు....

Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఖర్చులు విపరీతం. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. పనులు హడావుడిగా సాగుతాయి. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పిల్లల కదలికలపై దృష్టిపెట్టండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఏ విషయానికీ అధైర్యపడవద్దు. నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. కీలక పత్రాలు అందుకుంటారు. ఆచితూచి అడుగేయాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. రావలసిన ధనం అందుతుంది. మానసికంగా స్థిమితపడతారు. ఖర్చులు సంతృప్తికరం. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. పనులు నిరాటంకంగా సాగుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. కీలక వివరాలు వెల్లడించవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఓర్పుతో యత్నాలు సాగించండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. ముందుచూపుతో నిర్ణయాలు తీసుకోండి. ఆవేశాలకు లోను కావద్దు. ధనసమస్యలెదురవుతాయి. ఆప్తులు సాయం అందిస్తారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు పురమాయించవద్దు. మితంగా సంభాషించండి. మీ అభిమానానికి భంగం కలుగకుండా మెలగండి. ఉల్లాసంగా గడుపుతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు పాటించండి. నిలిచిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. ఫోన్ సందేశాలు నమ్మవద్దు. సన్నిహితులతో సంభాషిస్తారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారాల్లో మొహమ్మాటాలకు పోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ధనసహాయం తగదు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మాటతీరుతో నెట్టుకొస్తారు. మీ జోక్యం అనివార్యం.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంప్రదింపులు ఫలిస్తాయి. రుణ విముక్తులవుతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పనులు చురుకుగా సాగుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. గృహమరమ్మతులు చేపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. కొందరి వ్యాఖ్యలు కష్టమనిపిస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. మీ శ్రమ నిదానంగా ఫలిస్తుంది యత్నాలు విరమించుకోవద్దు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ముఖ్యులతో పరిచయాలేర్పడతాయి. వ్యవహారాలు మీ సమక్షంలో జరుగుతాయి. విజ్ఞతతోవ్యవహరిస్తారు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
18-06-2016 గురువారం ఫలితాలు - విశేష ఫలితాలు గోచరిస్తున్నాయి