ప్రధాని మోడి, భాజపా ఎంపి- సినీ నటి కంగనా రనౌత్‌ల డీప్‌ఫేక్ వీడియోలు కలకలం, ఎంత ధైర్యం?
దేశ ప్రధాని నరేంద్ర మోడీ, భాజపా ఎంపి-నటి అయిన కంగనా రనౌత్ లకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ వీడియోలను క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు... 'మేరీసనమ్ అఫీషియల్' అనే ఫేస్‌బుక్ పేజీ, 'వినోదం కోసం' అని మాత్రమే అని పేర్కొంటూ, అనేక డీప్‌ఫేక్ వీడియోలను పంచుకుంది.
వాటిలో బహిరంగ ప్రదేశంలో కంగనా రనౌత్ భుజంపై మోడీ చేయి వేసి ఉన్నట్లున్న వీడియో ఒకటి కాగా, చెట్లమధ్య వారిద్దరూ కౌగిలించుకుంటున్న మరో వీడియో వుంది. ఈ వీడియో కంటెంట్‌ను 'పూర్తిగా అసభ్యకరమైనది' అని, భారతీయులను అవమానించడమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.
అధికారులు ఆ పేజీని నిషేధించాలని, దాని సృష్టికర్తలను గుర్తించాలని, ప్లాట్‌ఫారమ్‌లను జవాబుదారీగా చేయాలని డిమాండ్ చేశారు. చట్టవిరుద్ధమైన డీప్‌ఫేక్‌లను తక్షణమే తొలగించాలని భారతదేశం ఇటీవల తీసుకొచ్చిన ఐటీ నిబంధనలను ఈ సంఘటన హైలైట్ చేస్తోంది. అయినప్పటికీ, ఆ పేజీ ఇంకా యాక్టివ్‌గానే ఉంది. ఏకంగా దేశ ప్రధానమంత్రి డీప్ ఫేక్ వీడియోలను సృష్టించడానికి ఎంత ధైర్యం? ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Hello @PMOIndia @HMOIndia
— The Jaipur Dialogues (@JaipurDialogues) August 15, 2026
Objectionable Ai Generated Videos are being circulated by this FB Page on PM
Modi
Page Name: Merisanamofficial
Please take strict action and get this page disabled pic.twitter.com/MXO84bcoyZ
