సంబంధిత వార్తలు
16-06-2026 మంగళవారం ఫలితాలు- అతిగా శ్రమించవద్దు
Astrology
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. పనులు ఒక పట్టాన పూర్తికావు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులను సంప్రదిస్తారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. బాధ్యతలు అప్పగించవద్దు.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఖర్చులు అధికం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఒత్తిడికి గురికావద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అన్ని విధాలా కలిసివచ్చే సమయం. చక్కని ప్రణాళికలతో ముందుకు సాగుతారు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ సాయంతో ఒకరికి శుభం జరుగుతుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో అశ్రద్ధ తగదు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఖర్చులు సామాన్యం. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఎదుటివారితో మితంగా మాట్లాడండి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమర్ధతను చాటుకుంటారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఉన్నతిని చాటుకోవటానికి వ్యయం చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారానుకూలత, ధనప్రాప్తి ఉన్నాయి. విజ్ఞతతో వ్యవహరిస్తారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. పిల్లల అత్యుత్సాహం అదుపు చేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలకు ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఏకాగ్రతతో శ్రమిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. పనుల్లో శ్రమ అధికం. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది.
