1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 13-06-2025 Daily Astrology

13-06-2026 శనివారం ఫలితాలు - మంచి చేయబోతే చెడు జరుగుతుంది..

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రణాళికలు వేసుకుంటారు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకుంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు 
పరిస్థితులు అనుకూలిస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. చేపట్టిన పనులు సాగవు. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రమేయంతో ఒకరికి మేలు జరుగుతుంది.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం.
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పొదుపు ధనం అందుతుంది. వేడుకకు యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఆత్మీయులను సంప్రదిస్తారు. నిలిపి వేసిన పనులు పూర్తి చేస్తారు. ఆయన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలు స్పష్టంగా తెలియజేయండి. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి. ఖర్చులు భారమనిపించవు. ఆత్మీయుల ప్రోత్సాహం కార్యోన్ముఖులను చేస్తుంది. కొత్తయత్నాలు చేపడతారు. సాయం ఆశించవద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు సానుకూలమవుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. సన్మాన, సంస్కరణ సభల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. దంపతుల మధ్య దాపరికం తగదు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు చక్కబడతాయి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. యత్నాలను ఆప్తులు ప్రోత్సాహిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సర్వత్రా అనుకూలమే. రావలసిన ధనం అందుతుంది. తాకట్టు విడిపించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు, నిలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, కీలక పత్రాలు జాగ్రత్త, పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిర్విరామంగా శ్రమిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యవహార లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు, ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు ముందుకు సాగవు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
జూన్ 13, 2026 శని త్రయోదశి.. నల్ల నువ్వుల నూనె దీపం.. 33 దానాలు