1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 11-06-2025 Daily Astrology

12-06-2026 శుక్రవారం ఫలితాలు... దంపతుల మధ్య కలహం

Love
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ఎదుటివారికి మీ సమర్థతపై గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు అందుపులో ఉండవు. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. నోటీసులు అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. దంపతుల మధ్య కలహం. ఊహించని సంఘటనలెదురవుతాయి. పనులు ముందుకు సాగవు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు విపరీతం. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు.
కీలక వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు, పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. ఉల్లాసంగా గడుపుతారు. అప్రియమైన వార్త వింటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులకు చేరువవుతారు. ధనలాభం కొందరి ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మీదైన రంగంలో మంచి ఫలితాలున్నాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. రుణ సమస్య పరిష్కారమవుతుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త, అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు, కొత్తయత్నాలు చేపడతారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. పనులు వేగవంతమవుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. ఆత్మీయులను కలుసుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండరు. పరధ్యానంగా ఉంటారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఖర్చులు సామాన్యం, పనుల్లో ఒత్తిడి అధికం. ఆత్మీయుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. కార్యానుకూలతకు నిర్విరామంగా శ్రమిస్తారు. శ్రమించినా ఫలితం ఉండదు. అపజయాలకు కుంగిపోవద్దు. దంపతుల మధ్య అకారణ కలహం. బంధువుల వైఖరి కష్టమనిపిస్తుంది. నోటీసులు అందుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. అపరిచితులతో మితంగా సంభాషించండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఖర్చులు సామాన్యం, కొంతమొత్తం పొదుపు చేస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. స్తోమతకు మించి హమీలివ్వవద్దు. మీ శ్రీమతి అభిప్రాయం తెలుసుకోండి. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీలు ముగుస్తాయి. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. చేపట్టిన పనులు సానుకూలమవుతాయి. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. విందుకు హాజరవుతారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
జూన్ 13, 2026 శని త్రయోదశి.. నల్ల నువ్వుల నూనె దీపం.. 33 దానాలు