1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Wonderful Remedies To Get A Job Immediately

Elachi Lamp: ఉన్నత ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఏలకుల దీపం వెలిగిస్తే?

Elachi
ఉన్నత చదువులు అభ్యసించిన వారికి ఉద్యోగం లభించడం లేదా.. కోరిన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? జీవితంలో ఉద్యోగం, విద్య, వృత్తికి సంబంధించిన ప్రతిబంధకాలు ఏర్పడుతుంటే బుధవారం హయగ్రీవ పూజ చేయడం మంచిది. విద్య, జ్ఞానం, జ్ఞాపకశక్తి, విజయం వంటివాటి కోసం ఆయనను ఆరాధించడం విశేషంగా భావించారు. ఇంకా విద్య, ఉద్యోగం, ఉద్యోగాల పెంపు, వృత్తిలో అభివృద్ధి వంటి అనేక విషయాలలో హయగ్రీవునితో పాటు కుమార స్వామిని పూజించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
ఇంకా బుధవారం పూట బుధ హోర సమయంలో ఏలకుల దీపం వెలిగించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. ఓ రాగి లేదా ఇత్తడి ప్లేటులో అర గుప్పెడు ఏలకులను వుంచి దానిపై నేతి దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని పువ్వులతో అలంకరించుకోవాలి. కాసింత కలకండను ప్లేటులో వుంచాలి. ఈ దీపం తూర్పు దిశగా వెలిగించాలి. ఈ దీపాన్ని బుధవారం లేదా శుక్రవారం పూట వెలిగించవచ్చు. ఏలకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మిక విశేషాలను ప్రసాదిస్తుంది. ఏలకులు శ్రీలక్ష్మీదేవికి ప్రీతికరం. ఇందుకు ప్రతికూలతలను తొలగించే శక్తి వుంది. అందుకే ఏలకుల దీపం వెలిగించడం ద్వారా అందులోని సువాసన హయగ్రీవ, శ్రీలక్ష్మిలకు ప్రీతికరమవుతుందని.. తద్వారా వారి అనుగ్రహంతో పదోన్నతి, ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 
Lights
Lights
 
అలాగే తమలపాకులతో మంగళవారం కుజ హోరలో దీపం వెలిగించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా జరుగుతాయి. ఇంకా ఉపాధి అవకాశాల కోసం, వ్యాపారాభివృద్ధి కోసం.. పదోన్నతి కోసం.. ఆశించే వారు మీరైతే.. గురువారంలో పశువులకు అరటిపండ్లు ఇవ్వడం మంచిది. ఇంకా పశువులకు నీటిని అందించడం, పశుగ్రాసాన్ని కొనివ్వడం వంటివి చేస్తే మంచి ఫలితాలు వుంటాయి. అలాగే హనుమంతుని పూజ ఉన్నత అవకాశాలను అందిస్తుంది. 
About Writer
సెల్వి