1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Software engineer with 18 years of experience working at McDonald's after being laid off

టెక్కీగా 18 యేళ్ల అనుభవం.. ఏఐ దెబ్బకు ఉద్యోగం పోయింది.. పోషణ కోసం మెక్‌డొనాల్డ్స్‌లో...

artificial intelligence
సాఫ్ట్‌వేర్ రంగంలో 18 ఏళ్ల తరబడి అనుభవం ఉన్న ఒక టెక్కీ కృత్రిమమేత (ఏఐ) దెబ్బకు ఉపాధిని కోల్పోయాడు. ఆ తర్వాత ఉద్యోగ అన్వేషణలో భాగంగా, వందకు పైగా కంపెనీల్లో ప్రయత్నాలు చేశాడు. కానీ, ఎక్కడా కూడా ఉపాధి లభించలేదు. దీంతో కుటుంబ పోషణ నిమిత్తం మెక్‌డొనాల్డ్స్ కంపెనీలో చేశాడు. ఆ టెక్కీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇపుడు వైరల్‌గా మారింది. 
 
ఏఐ కారణంగా ఎనిమిది నెలల క్రితం తాను ఉద్యోగం కోల్పోయానంటూ ఆ వ్యక్తి  తన పోస్టులో పేర్కొన్నాడు. తమ బృందంలో 12 మంది ఐటీ ఉద్యోగులం ఉండేవాళ్లమని, కంపెనీ మా అందరినీ తొలగించి కేవలం ఇద్దరు ఏఐ నిపుణులను నియమించుకుందని తెలిపాడు. వందకుపైగా ఉద్యోగాలకు అప్లై చేసినా జాబ్ దొరకలేదని వెల్లడించాడు. చివరకి కుటుంబ పోషణ కోసం ప్రస్తుతం మెక్‌డొనాల్డ్స్‌‌లో చేరినట్లు తెలిపాడు. 
 
తనకు తెలిసిన అనేక మంది అనుభవజ్ఞులైన ఇంజినీర్లు కూడా ప్రస్తుతం ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు. వారిలో కొందరు సంబంధంలేని ఉద్యోగాల్లో చేరినట్లు వెల్లడించాడు. ఈ పోస్టు తాజాగా నెట్టింట తీవ్ర చర్చకు దారి తీయగా.. నెటిజన్లు దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
కొందరు ఆ ఇంజినీర్‌ ఆవేదనను సమర్థిస్తూ కామెంట్లు పెడుతుండగా. మరికొందరు అనుభవం ఉన్నవారు ఏఐ సాధనాలు నేర్చుకుంటే.. వారికి డిమాండ్‌ పెరుగుతుందని పేర్కొంటున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కారుతో ఢీకొట్టి.. రెండు కిమీ దూరం దూసుకెళ్లిన డ్రైవర్