సంబంధిత వార్తలు
- Prabhas: కల్కి 2 అప్ డేట్ - ప్రభాస్ ఎంట్రీ తో కీలక సన్నివేశాల చిత్రీకరణ
- Nag Ashwin: సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్ కాంబినేషన్ చిత్రానికి టైటిల్ సింగ్ గీతం ఖరారు
- Kamal Hasan: కల్కి 2 లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కలిసిన వేళ
- Kalki 2 shoot: కల్కి 2 తాజా అప్ డేట్ - ప్రభాస్, అమితాబ్ బచ్చన్ పై సన్నివేశాల చిత్రీకరణ
- Singeetam: పొద్దుటూరులో సింగీతం శ్రీనివాస్ పంచాయితీ - తాజా అప్ డేట్..
Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్
Ritivik, Nag aswain, niharika and others
విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేశారు. దర్శకుడు , అనిల్ బోయిడపు విజన్ మొదటి ఫ్రేం నుంచే ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో వీకే నరేష్, రుత్విక్ తండ్రి పాత్రలో కనిపిస్తారు. తండ్రి–కొడుకుల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని టీజర్ హత్తుకునేలా చూపించింది. తన కొడుకు డాక్టర్ కావాలని తండ్రి ఆశపడుతుంటే, అతన్ని నిరాశపరచకుండా ఉండేందుకు అబద్ధం చెప్పే కుమారుడు మాత్రం ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కంటాడు.
తన కలను నిజం చేసుకోవాలని తపనపడే యువకుడిగా రుత్విక్ అద్భుతంగా కనిపించాడు. ఇక విశాఖ ధీమన్ పోషించిన ఆద్య పాత్ర కథలోకి ప్రవేశించిన తర్వాత హీరో జీవితంలో జరిగే మార్పులు ఆసక్తిని పెంచుతున్నాయి. ఆ మార్పుల వెనుక ఉన్న అసలు కథను పెద్ద తెరపై చూపించబోతున్నారు మేకర్స్.
హాస్యం, ప్రేమ, యాక్షన్, హీరో కలలు… ఇలా అన్ని భావోద్వేగాలను దర్శకుడు ఎంతో చక్కగా హ్యాండిల్ చేశారని టీజర్ ద్వారా తెలుస్తోంది. రవికిరణ్ బోయిడాపు సినిమాటోగ్రఫీ, మార్క్ కె రాబిన్ సంగీతం ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. రిత్విక్, నిహారిక ఫ్యామిలీ ఫ్రెండ్స్. రిత్విక్ జర్నీని నేను దగ్గరగా చూశాను. చాలా డెడికేషన్‌తో వర్క్ చేశాడు. నిహారిక ఈ సినిమాను చాలా గ్రాండ్‌గా నిర్మించారు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్”
హీరో రుత్విక్ మాట్లాడుతూ, రాజా ది రాజా జర్నీ చాలా మెమొరబుల్. నన్ను ఇంతగా నమ్మిన నా పేరెంట్స్‌కి థాంక్యూ. ప్రతి దశలో నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. త్వరలోనే సినిమా మీ ముందుకు వస్తుంది. డైరెక్టర్ అనిల్ చాలా డెడికేషన్‌తో సినిమా చేశారు. మంజు భార్గవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. సాయి కుమార్ గారు, నరేష్ గారు అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ. నన్ను సపోర్ట్ చేసిన నాగీ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు.
నిర్మాత నిహారిక దాసరి మాట్లాడుతూ.. రిత్విక్‌లో చాలా ప్రతిభ ఉంది. తన ప్యాషన్ కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. తప్పకుండా హీరోగా అందరినీ అలరిస్తాడు. మీ అందరి సపోర్ట్ తనకి ఉండాలని కోరుకుంటున్నాను. మార్క్ చాలా అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ థాంక్ యూ.
