1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Hyderabad : Software engineer ends life on Khairatabad railway tracks

మానసికస్థితి సరిగాలేని టెక్కీ రైలు పట్టాలపై పడుకున్నాడు.. తల మొండెం వేరయ్యాయి...

Track
హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. మానసికస్థితి సరిగా లేని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రైలు పట్టాలపై పడుకోగా, అతనిపై నుంచి రైలు దూసుకెళ్లింది. దీంతో అతని తల, మొండెం వేరయ్యాయి. 
 
పోలీసుల కథనం మేరకు... వరంగల్‌కు చెందిన వై.తరుణ్ (30) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఆయనకు గత 2017లో హైదరాబాద్‌కు చెందిన ప్రసన్న అనే యువతితో వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. నగరంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ భార్యతో కలిసి అత్తారింటికి సమీపంలోని అద్దె ఇంట్లో ఉంటున్నారు.
 
తరుణ్‌ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఒక యేడాదిగా చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఖైరతాబాద్‌ రైల్వే గేటు సమీపంలో పట్టాలపై కనిపించడంతో విధుల్లో ఉన్న గేట్‌మెన్ గుర్తించి బయటకు పంపించారు. 
 
ఆ తర్వాత కాసేపటి రైల్వే గేట్‌కు దాదాపు వంద అడుగుల దూరంలో పట్టాలపై తల పెట్టి పడుకున్నాడు. ఆ సమయంలో నాంపల్లి వైపు వెళ్తున్న రైలు ఢీకొనడంతో తల, మొండెం వేరయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా.. అప్పటికే అతని పక్కన ఉన్న ఫోన్ రింగ్ అవుతోంది. పోలీసులు ఫోన్‌ లిఫ్ట్ చేసి మాట్లాడగా.. మృతుడి వివరాలు తెలిశాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నాంపల్లి జీఆర్పీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
తర్వాతి కథనం
ప్లీజ్.. మాకు ఇంకో వందే భారత్ రైలును కేటాయించరూ... రైల్వే మంత్రికి సీఎం బాబు వినతి