Rahul Sipligunj Case: రాహుల్ సిప్లగింజ్ కేసు.. ఒకవేళ ఆమె రాకపోతే...?
Rahul Sipligunj
కేసు దర్యాప్తు ముందుకు సాగాలంటే, ఆమె తన ఫిర్యాదుకు మద్దతుగా ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమె రాకపోతే, చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఏసీపీ స్పష్టం చేశారు. ఆ మహిళ ఈ ఏడాది జూన్ 11న ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని అంబేద్కర్ తెలిపారు.
2025లో బంబుల్ డేటింగ్ యాప్ ద్వారా రాహుల్ రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడని, అతనితో సన్నిహిత సంబంధం ఏర్పడిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతను ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, ఆ తర్వాత వెనక్కి తగ్గాడని ఆరోపించారు.
తాను పోలీసులను ఆశ్రయించిన తర్వాత, రాహుల్ రెడ్డి తన అనుచరులతో కలిసి తనను బెదిరించాడని బాధితురాలు ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఆమె ప్రముఖ గాయకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత రాహుల్ సిప్లిగంజ్‌తో సహా మొత్తం 11 మంది పేర్లను ప్రస్తావించారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా, ఎంవీపీ పోలీసులు బీఎన్ఎస్, ఐటీ చట్టాలలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం ఈ కేసును మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. కేసులో పేర్లు పేర్కొన్న వ్యక్తులందరి పాత్రపై విచారణ జరుగుతోందని ఏసీపీ అంబేద్కర్ స్పష్టం చేశారు.
