1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 18-06-2025 Daily Astrology

18-06-2016 గురువారం ఫలితాలు - విశేష ఫలితాలు గోచరిస్తున్నాయి

Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు ఖర్చుచేస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. కొత్త పనులు చేపడతారు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఫోన్ సందేశాలు పట్టించుకోవచ్చు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. ఆచితూచి అడుగేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆప్తులు సాయం అందిస్తారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. పత్రాలు అందుకుంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు సంకల్పసిద్ధి ప్రధానం. ధైర్యంగా యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. అందరితోను మితంగా సంభాషించండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్ని విధాలా అనుకూలదాయకం. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఏ విషయాన్ని సమస్యగా పరిగణించవద్దు. పనులు సానుకూలమవుతాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. గుట్టుగా మెలగండి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ప్రయాణం తలపెడతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కలిసివచ్చే సమయం. ధైర్యంగా ముందుకు సాగండి. అవకాశాలను వదులుకోవద్దు. ఆర్ధికపరంగా మంచి ఫలితాలున్నాయి. ఆప్తులు సాయం అందిస్తరారు. పనుల్లో ఒత్తిడికి గురికావద్దు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి. పరిచయస్తులతో సంభాషిస్తారు. గృహ మరమ్మత్తులు చేపడతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
విశేష ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఊహించని ఖర్చులుంటాయి. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. అందరితోను మితంగా సంభాషించింది. ఆగ్రహావేశాలకు గురికావద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అవమానాలకు గురికావద్దు. కొందరి వ్యాఖ్యులు ఉద్రేకపరుస్తాయి. సామరస్యంగా మెలగండి. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం జూదాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు విపరీతం, రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. చిన్న విషయానికే చికాకు పడుతారు. ఖర్చులు విపరీతం. పనులు ఒక పట్టాన సాగవు పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. విందుకు హాజరవుతారు. ఇంటిని అలక్ష్యంగా వదిలేసి వెళ్లకండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రణాళికలతో ముందుకు సాగుతారు. అంచనాలు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పనులు చురుకుగా సాగుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. కిట్టని వ్యక్తులతో జాగ్రత్త ప్రయాణం లక్ష్యం నెరవేరుతుంది.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
19-06-2026 శుక్రవారం ఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు...