1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 19-06-2025 Daily Astrology

19-06-2026 శుక్రవారం ఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు...

Daily Astrology
Daily Astrology
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులతో తీరిక ఉండదు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఏ విషయంలోను రాజీపడద్దు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. చేపట్టిన పనులు మధ్యలో ఆపివేయొద్దు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. యత్నాలు విరమించుకోవద్దు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా పడతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అందరితోను మితంగా సంభాషించండి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ధృఢసంకల్పంతో అడుగు ముందుకేయండి. సాయం ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. నిస్తేజానికి లోనవుతారు. సన్నిహితులతో సంభాషిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ఫలిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూల సమయం. వ్యతిరేకులతో జాగ్రత్త. అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. 
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. చెల్లింపుల్లో జాగ్రత్త. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయొద్దు, ఆప్రమత్తంగా ఉండాలి. పందేలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సర్వత్రా ప్రోత్సాహకరం. ఆప్తుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు, ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు:
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. లావాదేవీలు కొలిక్కివస్తాయి. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. విందుకు హాజరవుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ప్రణాళికలు వేసుకుంటారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు, ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. అతిగా శ్రమించవద్దు. పనులు చురుకుగా సాగుతాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. 
 
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పనులు త్వరితగతిన సాగుతాయి. పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. గృహమరమ్మతులు చేపడతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రణాళికాబద్ధంగా శ్రమించండి. అనాలోచిత నిర్ణయాలు తగదు. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. సన్మాన, సంస్కరణ సభల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. దుబారా ఖర్చులు విపరీతం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆచితూచి అడుగేయాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
Budhaditya Yog 2026: బుధాధిత్య రాజయోగం.. ఏ రాశులకు లాభమో తెలుసా?