1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 22-06-2026 Daily Astrology

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

Astrology
Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
నేడు అనుకూలదాయకమే. వ్యవహారజయం, వాహనసౌఖ్యం ఉన్నాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు, విలువైన వస్తువులు జాగ్రత్త, ఉల్లాసంగా గడుపుతారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2, పాదాలు
మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమించండి. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. చేస్తున్న పనులు అర్ధాంతంగా నిలిపివేస్తారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పనులు మందకొడిగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాఠం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలతో తీరిక ఉండదు. అప్రమత్తంగా అడుగేయండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. మీ సమస్యలను ఆప్తులకు తెలియజేయండి.. ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు ముఖ్యం. ఆశావహదృక్పధంతో మెలగండి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. బెట్టింగ్ లకు పాల్పడవద్దు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. అసాధ్యమనుకున్న పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభవార్త వింటారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అన్ని విధాలా యోగదాయకమే. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. పరిచయస్తులతో సంభాషిస్తారు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. దుస్సాహస కృత్యాలకు పాల్పడవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాఠం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసిద్ధికి ఓర్చు, పట్టుదల ప్రధానం. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య ఎలాభిప్రాయం నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం
రుణ విముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. వేగవంతమవుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కీలక పత్రాలు అందుతాయి. లక్ష్యాన్ని సాధించే వరకూ శ్రమించండి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. హామీలు నిలబెట్టుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు
స్థిరాస్తి ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి, ఆచితూచి అడుగేయాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో మంచి ఫలితాలున్నాయి. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అనుకూలతలు అంతంత మాత్రమే. చిన్న విషయానికే చికాకుపడతారు. ఎవరినీ నిందించవద్దు, పట్టుదలతో యత్నాలు సాగించండి. అవకాశాలు కలిసివస్తాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. సంతానం చదువులపై దృష్టిపెడతారు.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది