1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 21-06-2025 Daily Astrology

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

Astrology
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మొండి ధైర్యంతో యత్నాలు సాగిస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. నగదు స్వీకరణ, చెల్లింపుల్లో జాగ్రత్త, ఆత్మీయులతో సంభాషిస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు, పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్ధికలావాదేవీలు కొలిక్కివస్తాయి. రుణవిముక్తులవుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. కొత్త పనులు చేపడతారు. లక్ష్యసాధనకు ఓర్పుతో శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అనుభవజ్ఞులను సంప్రదిస్తారు. ఖర్చులు విధంగా సంభాషించండి. పనులు పురమాయించవద్దు. ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసిద్ధికి సంకల్ప ముఖ్యం. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. ఖర్చులు సంతృప్తికరం. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. వ్యవహారంలో ఆచితూచి అడుగేయండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు.
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. లావాదేవీల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ధనలాభం ఉంది. ఉల్లాసంగా గడుపుతారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరులు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితో లక్ష్యాన్ని సాధిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. ముఖ్యుల ఇంటర్వ్యూ వీలుపడదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. మిత్రులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మీ సామర్ధ్యం పై ధైర్యం కలుగుతుంది. ఆటంకాలెదురైనా ముందుకు సాగుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. ఆశావహదృక్పథంతో యన్నాలు సాగించండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
ధనస్సు మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం
నిరంతర పనులతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల కోసం వ్యయం చేస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కలిసివచ్చే సమయం. ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. అవకాశాలు కలిసి వస్తాయి. సకాలంలో చెల్లింపులు బదుపుతారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం ముఖ్యుల సందర్శనం వీలుపడదు. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. మాట నిలబెట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆశించిన ఆశించిన పదవులు దక్కవు. మొండిగా పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు సంకల్పబలంతో శ్రమించండి. సాయం ఆశించవద్దు. ముందుచూపుతో వ్యవహరించండి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. ప్రయాణం తలపెడతారు.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు