23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. పెట్టుబడులకు తరుణం కాదు. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. రావలసిన ధనం అందుతుంది. పరిచయస్తులు సాయం అర్ధిస్తారు. ధనసహాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు. కీలక అంశాల్లో పెద్దల సలహా తీసుకోండి.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహ సంచారం బాగుంది. నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వాహనసౌఖ్యం పొందుతారు. ఖర్చులు సామాన్యం. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. చెల్లింపుల్లో జాగ్రత్త, ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. ప్రతి విషయంలోను అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు చక్కబడతాయి. ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. రుణసమస్య పరిష్కారమవుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వం స్వీకరిస్తారు. చేపట్టిన పనులు హడావుడిగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు.
సంతోషకరమైన వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు స్వయంగా చూసుకోండి. సాయం ఆశించవద్దు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అన్నివిధాలా అనుకూలం. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ధనసహాయం తగదు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సన్నిహితులతో సంభాషిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొత్త యత్నాలు సాగిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాఠం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. అనుభవజ్ఞుల సలహా పాటిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. కీలక పత్రాలు అందుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ధైర్యంగా ముందుకు సాగుతారు. చేపట్టిన పనులు త్వరితగతిన సాగుతాయి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. కార్యసాధనకు శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పత్రాలు జాగ్రత్త. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. పక్కవారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. కష్టమనుకున్న పనులు సానుకూలమవుతాయి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో మెలగండి. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. అపజయాలకు కుంగిపోవద్దు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు పురమాయించవద్దు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. విందుకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఓర్పుతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఆపత్సమయంలో ఆత్మీయులు ఆదుకుంటారు. మీ సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం, అందరితోను మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు.
