సంబంధిత వార్తలు
26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సన్నిహితులు వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ప్రణాళికా బద్ధంగా పనులు పూర్తి చేస్తారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అన్నివిధాలా అనుకూలదాయకం. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ప్రమేయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త పనులు చేపడతారు. అనవసర జోక్యం తగదు. ఇతరుల బాధ్యతలు చేపట్టి అవస్థపడతారు. కీలక పత్రాలు అందుకుంటారు. సోదరులను సంప్రదిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. జాగ్రత్తగా వాహనం నడపండి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికంగా పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. అతిగా ఆలోచించవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. మనోధైర్యంతో శ్రమిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుకోని సంఘటన ఎదురవుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. విశ్రాంతి లోపం, అకాలభోజనం, ఆచితూచి అడుగేయండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ముఖ్యుల కలయిక విలువదదు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్దలు ఆశీస్సులందుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరిస్తారు. మీ విజ్ఞత ఆకట్టుకుంటుంది. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యం సిద్ధిస్తుంది. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. ఆదాయానికి తగ్గటుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. కొత్తపనులు మొదలెడతారు. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరిని తప్పుపట్టవచ్చు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీలు ముగుస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. అందరితోను మితంగా సంభాషించండి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి ఆత్మస్థైర్యంతో అడుగులేస్తారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ధనసహాయం తగదు. పనులు హడావుడిగా సాగుతాయి. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అభీష్టం నెరవేరుతుంది. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లలు దూకుడు అదుపు చేయండి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. బాకీలను లౌక్యంగా రాబట్టుకోవాలి. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. పత్రాల్లో రెన్యువల్లో అలక్ష్యం తగదు. కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించుకుంటారు.
తర్వాతి కథనం
