25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులతో తీరిక ఉండదు. అనాలోచిత నిర్ణయం తగదు. ఒత్తిడికి గురికావద్దు. ఖర్చులు విపరీతం. ముఖ్యుల కలయిక వీలుపడదు. చేస్తున్న పనులు సాగవు. సన్నిహితులతో సంభాషిస్తారు. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. నోటీసులు అందుకుంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. అనుకోని సంఘటన ఎదురవుతుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. పరిచయాలు బలపడతాయి. పెద్దఖర్చు తగిలే అస్కారం ఉంది. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణసమస్య పరిష్కారమవుతుంది. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. స్థిరాస్తి వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. మధ్యవరులతో జాగ్రత్త.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోండి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అన్ని విధాలా కలిసివచ్చే సమయం. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. ధనసహాయం తగదు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యం సిద్ధిస్తుంది. సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంప్రదింపులతో తీరిక ఉండదు. మొండిబాకీలు వసూలవుతాయి. అర్ధాంతంగా ముగించిన పనులు పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. మొక్కులు తీర్చుకుంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహకలిగిస్తుంది. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. కొత్త పనులు మొదలెడతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. వివాదాలు కొలిక్కివస్తాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఒక సమాచారం సంతోషాన్నిస్తుంది.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఖర్చులు అధికం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. రుణ సమస్యలు కొలిక్కివస్తాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సన్మాన, సంస్మరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించండి. ఖర్చులు సామాన్యం. పనులు మొండిగా పూర్తిచేస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి.
