సంబంధిత వార్తలు
- 29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...
- 28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...
- 27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది
- 26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి
- 25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...
30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో పనిచేయండి. అనుమానాలకు తావివ్వవడం యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహ ఉంటుంది. ఖర్చులు సామాన్యం. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
స్వయం కృషితో లక్ష్యం సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ అభీష్టం నెరవేరుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. రోజు వారీ ఖర్చులే ఉంటాయి. దంపతుల మధ్య అకారణ కలహం. విందుకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి నగదు, ఆభరణాలు జాగ్రత్త.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తి చేయగలుగుతారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఆలయాలు సందర్శిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు, సంకల్పబలంతోనే విజయం సాధిస్తారు. ఖర్చులు సామాన్యం, పత్రాల రెన్యువల్‌ను అశ్రద్ధ చేయకండి. ఆస్తులతో సంభాషిస్తారు. అనుకున్న సకాలంలో పూర్తిచేస్తారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక నిర్ణయం తీసుకుంటారు. కొన్ని విషయాలు అడుగున్నద్ధి జరుగుతాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు. ఖర్చులు విపరీతం. చెల్లింపులో అలక్ష్యం తగదు. పనులు త్వరితగతిన సాగుతాయి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
భ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా భావించవద్దు. పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. పెట్టుబడుల విషయంలో పునరాలోచన శ్రేయస్కరం.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అభీష్టం నెరవేరుతుంది. కీలక వ్యవహారంలో మీచే పైచేయి. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాల్పేడతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అందరితో మితంగా సంభాషించండి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఆలోచనలు క్రియారూపం దాల్బుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం, ఇతరుల విషయాల్లో జోక్యం తగదు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. అవకాశాలను చేజిక్కుంచుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సంతానం చదువులపై దృష్టి సారిస్తారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. మీ సమర్థతను తక్కువ అంచనా వేసుకోవద్దు. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. ఖర్చులు భారమనిపించవు. పరిచయస్తులకు ధనసహాయం చేస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం.
