సంబంధిత వార్తలు
- 27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది
- 26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి
- 25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...
- 24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు
- 23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది
28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వ్యవహారంలో స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. భేషజాలకు పోవద్దు. పెద్దలను సంప్రదించండి. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. వ్యాఖ్యలు, విమర్శలు పట్టించుకోవద్దు. స్థిరాస్తి ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్ధికలావాదేవీలు కొలిక్కివస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఖర్చులు అధికం. మితంగా సంభాషించండి. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. పనులు వాయిదా వేసుకుంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంతోషకరమైన వార్త వింటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. మీ కృషి ఫలిస్తుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. పత్రాల రెన్యువల్, చెల్లింపుల్లో అలక్ష్యం తగదు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మీదైన రంగంలో ఒత్తిడికి గురికావద్దు. మాటతీరు అదుపులో ఉంచుకోండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఖర్చులు విపరీతం. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకొని తప్పటడుగు వేస్తారు. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అన్ని విధాలా అనుకూలమే. కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. స్థిరచరాస్తుల వ్యవహారంలో జాగ్రత్త, పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రత వహించండి. సాయం ఆశించవద్దు. ఓర్పు, స్వయంకృషితోనే కార్యం సాధ్యమవుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ధార్మిక, సేవా సంస్థలకు విరాళాలందిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. ధృఢసంకల్పంతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. ఏకాగ్రతతో మెలగండి. వ్యవహార ఒప్పందాల్లో తొందరపాటుతనం తగదు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్ధికంగా బాగున్నా ధనం మితంగా ఖర్చుచేయండి. ఆర్భాటాలకు పోవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. చేపట్టిన పనులపై శ్రద్ధ వహించండి. మీ ఏమరుపాటు ఇబ్బందులకు దారితీస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. మీదైన రంగంలో రాణిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. పనులు చురుకుగా సాగుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. వేడుకకు హాజరవుతారు. ఆత్మీయులకు కానుకలిచ్చిపుచ్చుకుంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం వృధాకాదు. మీ కృషి ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యాఖ్యలు వివాదాస్పదం కాకుండా చూసుకోండి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసాధనకు పట్టుదల ప్రధానం. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు అధికం. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు.
