సంబంధిత వార్తలు
- 28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...
- 27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది
- 26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి
- 25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...
- 24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు
29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహసంచారం అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగేయండి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. కష్టించినా ఫలితం ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. చేపట్టిన పనులు సాగవు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. సంప్రదింపులు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేయవద్దు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. ఆర్థిక వివరాలు గోప్యంగా ఉంచండి. కీలక పత్రాలు అందుకుంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. వస్త్రప్రాప్తి, వాహనయోగం పొందుతారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. సన్నిహితులతో సంభాషిస్తారు. పనులు సానుకూలమవుతాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
నేడు అనుకూలదాయకం. తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. తొందరపడి మాట ఇవ్వవద్దు. కీలక సమావేశంలో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకూలతలు అంతంత మాత్రమే. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చిన్న విషయానికే చికాకుపడతారు. మనస్సుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోండి. ఖర్చులు సామాన్యం. ప్రభుత్వ కార్యాలయంల్లో పనులు సానుకూలమవుతాయి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
విశేష ఫలితాలున్నాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు నియంత్రించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. విమర్శలు పట్టించుకోవద్దు. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ధనసమస్య ఎదురవుతుంది. ఖర్చులు తగ్గించుకోవటం శ్రేయస్కరం.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు చేరువవుతారు. పనులు పురమాయించవద్దు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
స్థిరాస్తి ధనం అందుతుంది. రుణ సమస్య పరిష్కారమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. లావాదేవీల్లో ఆచితూచి అడుగేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ప్రయాణం విరమించుకుంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
గ్రహసంచారం అనుకూలంగా ఉంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలు చేపడతారు. పనులు పురమాయించవద్దు. రోజువారి ఖర్చులుంటాయి. పత్రాల రెన్యువల్లో మార్పులు సాధ్యమవుతాయి
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. సమర్ధతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పరిస్థితులు చక్కబడతాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు. ప్రయాణం కలిసివస్తుంది.
