1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Russia issues international arrest warrant for Telegram founder Durov

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్‌కు అంతర్జాతీయ అరెస్ట్ వాంటెడ్ నోటీసు

Durov
Durov
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ కోసం అంతర్జాతీయ అరెస్ట్ వాంటెడ్ నోటీసు జారీ చేసినట్లు రష్యా బుధవారం ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వస్థలమైన సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జన్మించిన దురోవ్, రష్యా ఫేస్‌బుక్‌గా విస్తృతంగా పిలువబడే వీకాంటాక్టే అనే సోషల్ మీడియా సైట్‌ను స్థాపించారు. 
 
2010ల మధ్యలో అధికారుల నుండి ఒత్తిడికి గురైన ఆ సంస్థ నుండి ఆయనను తప్పనిసరిగా బయటకు పంపాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన టెలిగ్రామ్‌ను స్థాపించారు. ఇక ఇంటర్నెట్ రంగంపై మాస్కో తన పట్టును బిగించడంతో రష్యా అధికారులతో తరచుగా ఘర్షణ పడుతున్నారు.
 
టెలిగ్రామ్ నిర్వహణ విభాగం అధిపతి పి. దురోవ్ కోసం అంతర్జాతీయ స్థాయిలో వాంటెడ్ నోటీసు జారీ చేయబడిందని రష్యా భద్రతా సంస్థ తెలిపింది. మాస్కో తరచుగా తన రాజకీయ శత్రువులను ఉగ్రవాదం లేదా తీవ్రవాదంకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలతో లక్ష్యంగా చేసుకుంటుంది. 
 
రష్యన్లను విధ్వంసక చర్యలకు పాల్పడేలా బలవంతం చేయడానికి ప్రయత్నిస్తున్న ఉక్రేనియన్ భద్రతా సంస్థలకు టెలిగ్రామ్ ఒక నియామక వేదికగా ఉపయోగపడిందని ఆరోపణలు వస్తున్నాయి. ఇంకా దురోవ్ నిషేధిత సమాచారాన్ని తొలగించలేదని రష్యా ఆరోపించింది. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఆగస్టు 12వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో మాత్రం చూసే ఛాన్స్ లేదు