04-07-2026 శనివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు
Today 04-07-2026 Daily Astrology
లావాదేవీలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచించి ముందుకు సాగండి. ఒత్తిళ్లకు గురికావద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం, చెల్లింపుల్లో జాగ్రత్త, పత్రాలు అందుకుంటారు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. మీ జోక్యం అనివార్యం. వాహనసౌఖ్యం, ధనలాభం ఉన్నాయి. ఏకాగ్రతతో బాధ్యతలు నిర్వహించండి.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కృషి ఫలిస్తుంది. ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. వాహనం కొనుగోలు చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి అతి చొరవ ఇబ్బంది కలిగిస్తుంది.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కలిసివచ్చే సమయం, నిరుత్సాహం వీడి శ్రమించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. అర్ధాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. రావలసిన ధనం అందుతుంది.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు చక్కబడతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ఆప్తులతో సంభాషిస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతి విషయంలోను అప్రమత్తంగా ఉండాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. ఖర్చులు అధికం. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. సన్నిహితులు వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. చర్చల్లో పాల్గొంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు:
సంతోషకరమైన వార్త వింటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మనోధైర్యంతో ముందుకెడతారు. ధనసహాయం తగదు. అస్తవ్యస్తంగా సాగుతాయి. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. విందుకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఒత్తిడికి గురికావద్దు. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. ఒక పట్టాన సాగవు. బంధుమిత్రులతో సంభాషిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు.
ధనస్సు: మూల, పూర్వాషాడ 1,2,3,4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు విపరీతం, చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. మీ ఏమరుపాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సర్వత్రా అనుకూలం, అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది.. ఎంతటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇతరులను సలహాలు అడుగవద్దు, వ్యతిరేకులు తప్పుదారి పట్టిస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. గృహనిర్మాణం పూర్తవుతుంది. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. చేపట్టిన పనులు ఆలస్యంగానైనా పూర్తి చేయగలుగుతారు. ఖర్చులు విపరీతం, రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. పెద్దల చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు.
