సంబంధిత వార్తలు
02-07-2026 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి
Daily Astrology
కార్యసాధనకు పట్టుదలతో శ్రమిస్తారు. సంకల్పబలంతో లక్ష్యం నెరవేరుతుంది. లావాదేవీలతో తీరిక ఉండదు. ఖర్చులు విపరీతం. పనులు వాయిదా చేసుకుంటారు. పనులు ముందుకు సాగవు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
నిర్దేశిత ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ధనలాభం ఉంది. వాహనం కొనుగోలు చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. బంధువులతో సంభాషిస్తారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. వ్యాపకాలు అధికమవుతాయి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. పొదుపు ధనం అందుకుంటారు. ఆప్తులకు సాయం అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆగిపోయిన పనులు పూర్తిచేస్తారు. విందుకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. సమర్ధతను చాటుకుంటారు. కీలక అంశాల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. తాకట్టు విడిపించుకుంటారు, ముఖ్యమైన పత్రాలు అందుతాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు, సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలు అధికం. ఆలోచనలు నిలకడగా ఉండవు. అన్యమనస్కంగా గడుపుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంప్రదింపులతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనిభారం, అకాలభోజనం. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. పెట్టుబడులు కలిసిరావు. మీ నిర్ణయాన్ని వాయిదా వేయండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యం సిద్ధిస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. అన్ని విధాలా ప్రోత్సాహకరం, కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. రోజువారీ ఖర్చులుంటాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యం కాదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. కీలక వ్యవహారంలో ఏకాగ్రత వహించండి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాతాయి. ఖర్చులు విపరీతం. వాయిదా చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీదైన రంగంలో రాణిస్తారు. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ సమర్ధతపై నమ్మకం కలుగుతుంది. ధృఢసంకల్పంతో అడుగు ముందుకేస్తారు. సాయం ఆశించవద్దు. చెల్లింపుల్లో జాప్యం తగదు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. ఆత్మీయులకు సాదర వీడ్కోలు పలుకుతారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ఒంటెద్దు పోకడ తగదు. ఎదుటివారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోండి. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అనుకూల ఫలితాలున్నాయి. మీ కష్టం ఫలిస్తుంది. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతతాయి.
