1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Tirupati NEET Student Suicide

తిరుపతి నీట్ విద్యార్థిని ఆత్మహత్య.. కోటి డిమాండ్ చేసిన ఎస్.ఎఫ్.ఐ

NEET Student
NEET Student
తిరుపతిలో నీట్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై మానసిక ఆందోళనతో ఎస్.వి. నగర్‌కు చెందిన సాయి మేఘన ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఏడాది మే నెలలో జరిగిన మొదటి నీట్ పరీక్షలో ఆమె 499 మార్కులు సాధించింది. 
 
కానీ పేపర్ లీక్ కారణంగా పరీక్షను మళ్లీ నిర్వహించారు. అయితే మళ్లీ నిర్వహించిన నీట్ పరీక్షలో సాయి మేఘన 390 మార్కులు మాత్రమే సాధించడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. దీంతో సాయి మేఘన ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జరిగి పది రోజులు గడిచింది. 
 
కానీ దశదిన కర్మ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ నాయకుల పరామర్శతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంకా బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఎస్.ఎఫ్.ఐ డిమాండ్ చేసింది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
మలద్వారంలో రూ. 65 లక్షల విలువైన బంగారం గోళీలు, పట్టేసిన అధికారులు