హిండ్‌వేర్ ఇటాలియన్ కలెక్షన్, మార్కెట్లోకి సరికొత్త డిజైన్లు సిరామిక్ టైల్స్ శ్రేణి విడుదల
గుజరాత్‌లోని మోర్బిలో, హిండ్‌వేర్ ఇటాలియన్ కలెక్షన్ తన 2026 సిరామిక్ టైల్స్ కలెక్షన్‌ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా సిరామిక్ వాల్ టైల్స్, ఎలివేషన్ టైల్స్‌లో విస్తృత శ్రేణిలో కొత్త డిజైన్‌లు, ఫినిషింగ్‌లను పరిచయం చేసింది. ఈ లాంచ్‌లో భాగంగా, కంపెనీ తన సరికొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. కస్టమర్‌లు, ఆర్కిటెక్ట్‌లు, డిజైనర్లు, వ్యాపార భాగస్వాములకు ఉత్పత్తులను సరికొత్తగా, ప్రత్యక్షంగా అనుభూతి చెందేలా చేయడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న 90 మంది ఛానెల్ భాగస్వాముల సమక్షంలో హింద్‌వేర్ లిమిటెడ్ సిఇఒ శ్రీ నిరుపమ్ సహాయ్, హింద్‌వేర్ టైల్స్ బిజినెస్ హెడ్ శ్రీ పంకజ్ మెదిరట్ట, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ బాత్ & టైల్స్ శ్రీమతి అరుణిమా యాదవ్ ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించారు.
అంతర్జాతీయ డిజైన్ ధోరణుల (ట్రెండ్స్) నుండి ప్రేరణ పొందిన ఈ కొత్త కలెక్షన్, విభిన్న ఇంటీరియర్ శైలులకు సరిపోయేలా విస్తృత శ్రేణి నమూనాలను అందిస్తోంది. ఇండ్ల యజమానులు, ఆర్కిటెక్ట్‌లు తమకు నచ్చినట్లుగా... జ్యామితీయ (జియోమెట్రిక్), క్లాసిక్ ఫ్లోరల్, మోడరన్ స్ట్రైప్స్ (చారలు), బ్రిక్ (ఇటుక), స్క్వేర్ (చతురస్ర), మరియు అలల వంటి వేవ్ డిజైన్ల నుండి ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఈ కలెక్షన్‌లో సహజమైన పాలరాయి (మార్బుల్), రాతి (స్టోన్) డిజైన్లను తలపించే సరికొత్త మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి లగ్జరీ మెటీరియల్స్ ఇచ్చే ప్రీమియం లుక్‌తో పాటు, హై-ఎండ్ సిరామిక్ టైల్స్ ఇచ్చే మన్నికను, నిర్మాణ ప్రయోజనాలను అందిస్తాయి.
కేవలం అందమైన డిజైన్లకే పరిమితం కాకుండా, తక్కువ నిర్వహణతో (మెయింటెనెన్స్) ఎక్కువ కాలం మన్నేలా వీటిని రూపొందించడం ఈ కలెక్షన్ యొక్క ప్రత్యేకత. ఈ సిరామిక్ వాల్ టైల్స్ ఇంటి లోపలి భాగాలను సులభంగా శుభ్రం చేసుకునే సౌలభ్యాన్ని అందిస్తాయి. అదే సమయంలో, ఇంటి బయటి గోడలు (ఎలివేషన్), బాల్కనీలు మరియు ప్రహరీ గోడల కోసం ఈ దృఢమైన ఎలివేషన్ టైల్స్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. ఇవి వాతావరణ మార్పులను తట్టుకోవడమే కాకుండా, కాలక్రమేణా జరిగే అరుగుదల వల్ల రంగు వెలిసిపోకుండా సుదీర్ఘకాలం కొత్తవిలా మెరుస్తాయి.
ఈ శ్రేణిలో గ్లాసీ, మ్యాట్ మరియు యాంటీ-స్కిడ్ ఫినిష్‌లతో కూడిన 300x600 మి.మీ వాల్ టైల్స్, 300x450 మి.మీ గ్లాసీ వాల్ టైల్స్, అలాగే రెయిన్‌డ్రాప్ మరియు రస్టిక్ ఫినిష్‌లతో 300x600 మి.మీ మరియు 300x450 మి.మీ పరిమాణాల్లో లభించే ఎలివేషన్ టైల్స్ ఉన్నాయి.
ఈ లాంచ్‌లో భాగంగా... మోర్బిలోని జాతీయ రహదారిపై వ్యూహాత్మకంగా 7,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక సరికొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆర్కిటెక్టులు, డిజైనర్లు, డీలర్లు మరియు కస్టమర్ల అవసరాలన్నింటినీ ఒకే చోట తీర్చేలా (వన్-స్టాప్ డెస్టినేషన్‌గా) దీనిని రూపొందించారు. ఈ శ్రేణిలోని వైవిధ్యభరితమైన డిజైన్లు, విభిన్న ఫినిషింగ్‌లు మరియు నిర్మాణ శైలులను కళ్ళకు కట్టినట్లు (లైవ్‌గా) ప్రదర్శించేలా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దారు. దీనివల్ల, ఈ ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్ టైల్స్ తమ అందచందాలతో పాటు రోజువారీ మన్నికను ఎలా బ్యాలెన్స్ చేస్తాయో కస్టమర్లు సులభంగా చూసి తెలుసుకోవచ్చు.
ఈ ప్రారంభోత్సవంపై హిండ్‌వేర్ లిమిటెడ్ సీఈఓ శ్రీ నిరూపమ్ సహాయ్ మాట్లాడుతూ, “మా సరికొత్త సిరామిక్ టైల్స్ కలెక్షన్, నేటి ఆధునిక భారతీయ డిజైన్ ట్రెండ్స్‌ను ప్రతిబింబిస్తోంది. ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ ప్రదేశాలకు సరిపోయేలా ఎంతో ఆకర్షణీయమైన డిజైన్లు మరియు ప్రీమియం ఫినిషింగ్‌లతో దీనిని రూపొందించాం. కొత్త వ్యాపార సీజన్‌లోకి అడుగుపెడుతున్న ఈ తరుణంలో, మా వ్యాపార భాగస్వాములతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఈ సరికొత్త ఆవిష్కరణ ఒక బలమైన ముందడుగుగా నిలుస్తుందని మేము విశ్వసిస్తున్నాము.” అని అన్నారు
ఆయన ఇంకా ఇలా అన్నారు, "భారతదేశంలో సిరామిక్ తయారీకి మోర్బీ ఎప్పటి నుంచో ప్రధాన కేంద్రంగా ఉంది. మా 'టైల్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్' ద్వారా, ఆ స్థాయిని మరియు నైపుణ్యాన్ని మా డీలర్లు, ఆర్కిటెక్ట్‌లు మరియు వినియోగదారులకు ఒకే చోట నేరుగా అందించగలుగుతున్నాము. ఇది వారికి టైల్స్‌ను కేవలం విడి ముక్కలుగా కాకుండా, వాస్తవ వినియోగంలో అవి ఎలా ఉంటాయో పూర్తిగా చూసే అవకాశాన్ని కల్పిస్తుంది."
