వైఎస్ షర్మిలకు ఏమైంది? త్వరగా కోలుకోవాలంటున్న బాబు, పవన్, లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు(ఏపీ పీసీసీ చీఫ్) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యం పాలయ్యారు. ఇటీవల వైద్యులు ఆమెకు ఉదర ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. చికిత్స అనంతర ఆమె వేగంగా కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని షర్మిల స్వయంగా వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో తన ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ, త్వరగా కోలుకోవాలని కాంక్షించిన శ్రేయోభిలాషులు, మద్దతుదారులకు కృతజ్ఞతలు. అందరి ఆత్మీయత, ప్రార్థనలు, మద్దతు తనకు కొండంత అండగా నిలిచాయని షర్మిల తెలిపారు.
అలాగే, వైఎస్ షర్మల త్వరగా కోలుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా మంత్రి నారా లోకేశ్‌లు ఆకాంక్షించారు. ఆమెకు ఆమెచి ఆరోగ్యం చేకూరాలని, మనోధైర్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని చంద్రబాబు పేర్కొన్నారు. షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా ప్రజా జీవితంలోకి రావాలని కోరుకుంటున్నన్నట్టు పవన్, లోకేశ్‌లు ఎక్స్ వేదికలో పోస్ట్ చేశారు.
ఇకపై క్రియాశీలక ఎన్నికల్లో పోటీ చేయను : సిద్ధరామయ్య
ఇకపై క్రియాశీలక ఎన్నికల్లో పోటీ చేయబోనని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కర్నాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికలు 2028సంవత్సరంలో జరుగనున్నాయి. ఈ ఎన్నికలతో పాటు ఏ ఇతర ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
రాజకీయ రంగం అవినీతిమయంగా మారిపోయిందని.. తనకూ వయసు పైబడటం, అనారోగ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తనకు 79ఏళ్లని.. తన పదవీకాలం ఇంకా ఏడాదిన్నర పాటు ఉందని పేర్కొన్నారు. అప్పటికి తన వయసు 81-82 ఏళ్లకు చేరుకుంటుందన్నారు. ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల మునుపటిలా అదే ఉత్సాహంతో పనిచేయడం ఇక సాధ్యం కాదని వెల్లడించారు. అయితే ప్రజా జీవితంలో చురుకుగా ఉంటూ ప్రజల తరపున గళం మాత్రం వినిపిస్తూనే ఉంటానని పేర్కొన్నారు.
2028 నాటికి తన రాజకీయ ప్రస్థానం 50ఏళ్లకు చేరుకుంటుందని సిద్ధరామయ్య తెలిపారు. 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని.. దశాబ్దాల కాలంలో ఎన్నో విజయాలు, ఓటములు చవిచూశానని పేర్కొన్నారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో తాను నమ్మిన సూత్రాలకు విరుద్ధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదన్నారు.
గతంలో తాను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నియోజకవర్గ ప్రజలే స్వచ్ఛందంగా డబ్బు సమకూర్చేవారని సిద్ధరామయ్య తెలిపారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని.. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజలకు డబ్బు పంచాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మద్దతుగా నిలిచిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
కొన్ని నెలల క్రితం సిద్ధరామయ్య స్వచ్ఛందంగా కర్ణాటక సీఎం పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడిగా నియమిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
