1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 24-07-2026 Daily Astrology

Daily Astrology: 24-07-2026 శుక్రవారం ఫలితాలు.. ఒత్తిడికి గురికావద్దు

Daily Astrology
Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం సంతోషపరుస్తుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. లక్ష్యం సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు సామాన్యం చెల్లింపుల్లో జాప్యం తగదు. ఆహ్వానం అందుకుంటారు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. వాదనలకు దిగవద్దు. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. విజ్ఞతతో సమస్కలు పరిష్కరించుకుంటారు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. పిల్లల దూకుడు అదుపు చేయండి. నగదు, వస్తువులు జాగ్రత్త. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రుణసమస్య తొలగుతుంది. మానసికంగా కుదుటపడతారు. ప్రణాళికలు చేసుకుంటారు. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పిల్లల ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. పత్రాలు అందుకుంటారు. ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
కార్యసాధనతకు ఓర్పు ప్రధానం. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దు ఆశావహదృక్పథంతో శ్రమించండి. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తికాగలవు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పెద్దల హితవు మీపై ప్రభావం చూపుతుంది. అనుభవజ్ఞులను సంప్రదిస్తారు. ఖర్చులు విపరీతం. పనులు సకాలంలో పూర్తవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతారు. ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. అవసరాలను నెరవేర్చుకుంటారు. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఇతరుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లక్ష్యానికి చేరువవుతారు. శుభకార్యం విజయవంతమవుతుంది. స్థోమతకు మించి ఖర్చుచేస్తారు. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. చేసిన పనులే చేయవలసి వస్తుంది, మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్య అనుకోవద్దు. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంకల్పం బలంతో యత్నాయి కొనసాగించండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. సాయం ఆశించవద్దు. ఖర్చులు తగ్గించుకోండి. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాల హడావుడిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలెదురైనా పూర్తి చేస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యం సాధిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. రుణ ఒత్తిడి తగ్గుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు త్వరితగతిన సాగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ కృషి ఫలిస్తుంది. లక్ష్యం సాధిస్తారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. జూదాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
యత్నాల్లో అవాంతరాలెదురఫుతాయి. ధైర్యంగా ముందుకు సాగండి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు. చిన్న విషయానికి చికాకు పడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
TTD: శ్రీవాణి దర్శన టిక్కెట్ల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్‌