సంబంధిత వార్తలు
- 21-07-2026 మంగళవారం ఫలితాలు- తప్పుచేశామన్న భావం రానీయకండి
- 20-07-2026 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...
- 19-07-2026 ఆదివారం ఫలితాలు - వస్తులాభం.. వస్త్రప్రాప్తి ఉన్నాయి....
- 18-07-2026 శనివారం ఫలితాలు - శ్రీమతి వైఖరిలో మార్పు...
- 17-07-2026 శుక్రవారం ఫలితాలు - లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి..
22-07-2026 బుధవారం ఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఖర్చులు విపరీతం, అవసరాలు అతి కష్టంమ్మీద నెరవేరతాయి. పనులు పురమాయించవద్దు. ఆప్తులతో సంభాషిస్తారు. ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం సంతోషపరుస్తుంది.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. లక్ష్యం సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. చెల్లింపుల్లో జాప్యం తగదు. ఆహ్వానం అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త, సకాలంలో పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం బాగుంటుంది. వేడుకకు హాజరవుతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రుణసమస్య తొలగుతుంది. మానసికంగా కుదుటపడతారు. ప్రణాళికలు వేసుకుంటారు. దుబారా ఖర్చులు విపరీతం. చెల్లింపులో జాప్యం తగదు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. దూరప్రయాణం తలపెడతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధననకు ఓర్పు ప్రధానం. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆశావహదృక్పధంతో శ్రమించండి. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తికాగలవు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పెద్దల హితవు మీపై ప్రభావం చూపుతుంది. అనుభవజ్ఞులను సంప్రదిస్తారు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
గ్రహాల సంచారం బాగుంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లక్ష్యానికి చేరువవుతారు. వేడుక విజయవంతమవుతుంది. ఖర్చులు విపరీతం. చేసిన పనులే చేయవలసి వస్తుంది. ఏ విషయాన్నీ, పెద్ద సమస్యగా అనుకోవద్దు. గృహమరమ్మతులు చేపడతారు. పొరుగువారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి. విజ్ఞతతో వ్యవహరిస్తారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. సంకల్పబలంతో యత్నాలు కొనసాగించండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం ఆదాయం సామాన్యం. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆర్ధికంగా నిలదొక్కుకుంటారు. రుణ ఒత్తిడి తగ్గుతుంది. రోజు వారి ఖర్చులే ఉంటాయి. పనులు త్వరితగతిన సాగుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
విశేష ఫలితాలున్నాయి. మీ కృషి ఫలిస్తుంది. లక్ష్యం వైపు దృష్టి సారిస్తారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ధనసహాయం తగదు. పనులు ఇతరులకు అప్పగించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉచండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చేపట్టి పనుల్లో స్వల్ప ఆటంకాలెదురవుతాయి. ఆశావహదృక్పథంతో ముందుకు సాగండి. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
