17-07-2026 శుక్రవారం ఫలితాలు - లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి..
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలు అధికం. ఆలోచనలు నిలకడగా ఉండవు. పరిస్థితులు అనుగుణంగా మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. రాబడిపై దృష్టి పెడతారు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. అందరితోను మితంగా సంభాషించండి. పనులు హడావుడిగా సాగుతాయి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
నిర్విరామంగా శ్రమిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. చిన్న విషయానికే చికాకుపడతారు. ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని ఓ కంట కనిపెట్టండి. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్ని విధాలా కలిసివచ్చే సమయం. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అందరితోను మితంగా సంభాషించండి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. ఖర్చులు సామాన్యం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. తొందరపాటు నిర్ణయం తగదు. పెద్దలను సంప్రదించండి. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తిచేస్తారు. ఖర్చులు విపరీతం. ప్రముఖుల ఇంటర్వ్యూ. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. మీ సమర్ధతను తక్కువ అంచనా వేసుకోవద్దు. కొన్ని సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. స్థిరాస్థి ధనం అందుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. ఆటంకాలెదురైనా ఆందోళన చెందవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రణాళికాబద్ధంగా యత్నాలు సాగిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఆపన్నులకు సాయం అందిస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. కీలక పత్రాలు అందుకుంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. కొత్త పనులు చేపడతారు. ఖర్చులు అధిరం. ప్రయోజనకరం. అపరిచితులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. సమావేశంలో పాల్గొంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కొంతమేరకు అనుకూలమే. కొన్ని సమస్యలు తొలగుతాయి. సమయస్ఫూర్తితో మెలుగుతారు. పనులు సావకాశమవుతాయి. ఖర్చులు విపరీతం. అవసరానికి ఆత్మీయులు సాయం చేస్తారు. సంతానం చదువులపై దృష్టిపెడతారు. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీ ఓర్పునకు పరీక్షా సమయం. వ్యవహారంలో తొందరపాటు తగదు. ఆచితూచి అడుగేయండి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సాయం ఆశించి భంగపడతారు. పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
విశేషమైన కార్యసిద్ధి ఉంది. పట్టుదలతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. పనులు త్వరితగతిన సాగుతాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రతికూలతలు తొలగుతాయి. ఉత్సాహంగా శ్రమించండి. పనులు మధ్యలో ఆపివేయవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. ఖర్చులు అధికం. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. కీలక వ్యవహారంలో అప్రమత్తతంగా ఉండాలి.
