1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 21-07-2026 Daily Astrology

21-07-2026 మంగళవారం ఫలితాలు- తప్పుచేశామన్న భావం రానీయకండి

Daily Astrology
Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అనుకున్న కార్యం సాధిస్తారు. అనుకూలతలు నెలకొంటాయి. ప్రముఖలను ఆకట్టుకుంటారు. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు హడావుడిగా సాగుతాయి. కొత్తయత్నాలు చేపడతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సర్వదా అనుకూలమే. ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. సన్నిహితులు వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త పనులు చురుకుగా సాగుతాయి. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ప్రైవేట్ ఫైనాన్సులు జోలికి పోవద్దు. పనులు త్వరితగతిన సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆప్తుల వ్యాఖ్యలు ప్రభావితం చేస్తాయి. పట్టుదలతో ముందుకు సాగుతారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ కష్టం వృధాకాదు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. ఇతర విషయాల్లో జోక్యం తగదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి వ్యవహారంలో మెలకువ వహించండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకూలతలు అంతంత మాత్రమే. సంప్రదింపులు వాయిదా పడతాయి. చిన్న విషయానికే చికాకుపడతారు. సంకల్పబలంతో ముందుకు సాగండి. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. ముఖ్యలు కలయిక వెలువడదు. పనులు ఒక పట్టాన సాగవు. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి. ఒత్తిళ్లకు గురికావద్దు. ఆప్తులతో సంభాషిస్తారు. ఖర్చులు సామాన్యం. కొత్త యత్నాలు మొదలెడతారు. అవకాశాలను అందిపుచ్చుకోండి. ప్రముఖలతో పరిచయాలేర్పడతాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. అన్నింటా మీదే పైచేయి. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. కొత్త పనులు చేపడతారు. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రియతములతో సంభాషిస్తారు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. ప్రయాణం తలపెడతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సర్వత్రా కలిసివచ్చే సమయం. వేడుకను ఘనంగా చేస్తారు. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. సన్నిహితుల ప్రోత్సాహం కార్యోన్ముఖులను చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. అవకాశాలు వదులుకోవద్దు. తప్పుచేశామన్న భావం రానీయకండి. పదవులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. పెద్దఖర్చు ఎదురవుతుంది. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు త్వరితగతిన సాగుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. పత్రాలు అందుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్ధికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఫైనాన్సు వ్యాపారాల జోలికి పోవద్దు, పసులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. నోటీసులు అందుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమించినా ఫలితం శూన్యం. లక్ష్యానికి చేరువలో ఉన్నారు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి సన్నిహితుల వ్యాఖ్యలకు స్పందిస్తారు. ఖర్చులు విపరీతం. పనులు సానుకూలమవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు పందాలు, బెట్టింగ్ జోలికి పోవద్దు.
About Writer
పి.ప్రసూనా రామన్