సంబంధిత వార్తలు
- 18-07-2026 శనివారం ఫలితాలు - శ్రీమతి వైఖరిలో మార్పు...
- 17-07-2026 శుక్రవారం ఫలితాలు - లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి..
- 16-07-2026 గురువారం ఫలితాలు - పరిస్థితులు అనుకూలిస్తాయి
- 15-07-2026 బుధవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి...
- 14-07-2026 మంగళవారం ఫలితాలు (అమావాస్య) - దంపతుల మధ్య అకారణ కలహం
19-07-2026 ఆదివారం ఫలితాలు - వస్తులాభం.. వస్త్రప్రాప్తి ఉన్నాయి....
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అనుకున్న కార్యం నెరవేరుతుంది. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు విపరీతం. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. నిపుణులను సంప్రదిస్తారు. పత్రాల్లో సవరణలు అనివార్యం. గత అనుభవంతో తప్పిదాన్ని సరిదిద్దుకుంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లావాదేవీలు మగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. ఖర్చులు అధికం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కొత్తయత్నాలు చేపడతారు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. ప్రయాణం కలిసివస్తుంది.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
విశేష ఫలితాలున్నాయి. ఖర్చులు ప్రయోజనకరం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రియతముల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. అవిశ్రాతంగా శ్రమిస్తారు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కీలక వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతికి ప్రతి విషయం తెలియజేయండి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు గురికావద్దు. పెద్దల సలహా పాటించండి. ఊహించని ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. సన్నిహితుల కలయిక వీలుపడదు. చీటికిమాటికి చికాకుపడతారు. వేడుకకు హాజరవుతారు. ఇంటిని అలక్ష్యంగా వదిలి వెళ్లకండి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొత్త పనులు చేపడతారు. వ్యవహారాల్లో తొందరపాటుతనం తగదు. పెద్దల సలహా పాటించండి. భేషజాలకు పోవద్దు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. విలాసాలకు ఖర్చు చేస్తారు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యసాధనకు చేరువలో ఉన్నారు. యత్నాలు విరమించుకోవద్దు. పెద్దల వ్యాఖ్యలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. పత్రాలు అందుకుంటారు. వ్యవహారంలో ఏకాగ్రత వహించండి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
రుణసమస్య పరిష్కారమవుతుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. పనులు అర్ధాంతంగా ముగించవలసి వస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఖర్చులు సామాన్యం. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఖర్చులు విపరీతం. పనులు పురమాయించవద్దు సన్నిహితులను విందుకు ఆహ్వానిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
