1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 15-07-2026 Daily Astrology

15-07-2026 బుధవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి...

Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యం సిద్ధిస్తుంది. ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి. ఖర్చులు సామాన్యం. నిర్దిష్ట ఆలోచనలతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆప్తుల సలహా పాటిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో ముందుకు సాగండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరి చికాకు కలిగిస్తుంది.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్ని విధాలా అనుకూలం. ధైర్యంగా యత్నాలు సాగించండి. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేయవద్దు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. వాయిదాల చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. సంప్రదింపులు ఫలిస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ నొప్పించవద్దు. మీ వ్యాఖ్యలు వివాదాస్పదం కాకుండా చూసుకోండి. ఊహించని ఖర్చులుంటాయి. పనుల ప్రారంభంలో అటంకాలు ఎదురవుతాయి. పట్టుదలతో ముందుకు సాగండి. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
దీర్ఘకాలిక సమస్య కొలిక్కివస్తుంది. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. ప్రముఖులకు చేరువవుతారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. లావాదేవీలతో తీరిక ఉండదు. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ఆరోగ్యం జాగ్రత్త. ఆత్మీయులతో తరుచు సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అనుకూలతలు అంతంత మాత్రమే. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు అధికం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ప్రయాణం విరమించుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించి భంగపడతారు. పరిచయస్తుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. ధైర్యంగా యత్నాలు సాగించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అపరిచితులతో మితంగా సంభాషించండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
విశేషమైన ఫలితాలున్నాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. అర్థాంతంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ కృషి ఫలిస్తుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. సమస్య సద్దుమణుగుతుంది. 
About Writer
ఠాగూర్