1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 14-07-2026 Daily Astrology

14-07-2026 మంగళవారం ఫలితాలు (అమావాస్య) - దంపతుల మధ్య అకారణ కలహం

Astrology
Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఒత్తిళ్లకు గురికావద్దు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పరిస్థితులు చక్కబడతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించుకుంటారు.

మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి. మీ తప్పిదాలకు ఇతరులను నిందించవద్దు. ధృఢసంకల్పంతో శ్రమించండి. ఖర్చులు విపరీతం. చేబదుళ్లు స్వీకరిస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తిచేస్తారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. ఖర్చులు అధికం. ముఖ్యుల కలయిక వీలుపడదు. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
పరిస్థితులు అనుకూలిస్తాయి. చిత్తశుద్ధిని చాటుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. అందరితోను మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరిస్తారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. ఖర్చులు విపరీతం. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. పత్రాలు అందుకుంటారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పిల్లల దూకుడు అదుపుచేయండి. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఊహించని ఖర్చులెదురవుతాయి, పనులు ఒక పట్టాన పూర్తికావు. చిన్న విషయానికే అసహనం చెందుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యానికి చేరువలో ఉన్నారు. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. ఆశావహదృక్పథంతో శ్రమించండి. సాయం ఆశించవద్దు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. యత్నాలు విరమించుకోవద్దు. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఖర్చులు తగ్గించుకోండి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. దూరపు బంధువులతో సంభాషిస్తారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. కొందరి నిర్లక్షం ఇబ్బంది కలిగిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్థాంతంగా ముగిస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం.
About Writer
పి.ప్రసూనా రామన్