అమావాస్య రోజున ఆకాశంలో అరుదైన కలయిక.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు
Six Planets
ఆగష్టు 12 రాత్రి నుండి ఇది గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. గంటకు 10 నుండి 50 ఉల్కలు కనిపిస్తాయి. అయితే, మేఘావృతమైన ఆకాశం కారణంగా వీటిని చూడటం కష్టమవుతుంది. ఇదిలా ఉండగా, అదే రోజున సంపూర్ణ సూర్యగ్రహణం గ్రీన్‌ల్యాండ్, ఐస్‌ల్యాండ్, ఉత్తర స్పెయిన్ మీదుగా వెళుతుంది. ఇది భారతదేశంలో కనిపించదు. దీనిపై హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఖగోళశాస్త్ర క్లబ్‌కు చెందిన సమర్థ్ మజుందార్ మాట్లాడుతూ, సాధారణంగా ఔత్సాహికులు ఇటువంటి అరుదైన సంఘటనలను వీక్షించడానికి పరికరాలతో వస్తారని, కానీ రుతుపవనాల మేఘాలు క్లబ్‌లను నిరాశపరిచాయని అన్నారు.
హైదరాబాద్‌లోని బిర్లా ప్లానెటేరియం శాస్త్రీయ అధికారి మృణాలినీ రమణంజ మాట్లాడుతూ, ఐఎండీ అంచనా వేసిన మేఘావృతమైన ఆకాశం, నగర ఔత్సాహికులకు ఆరు గ్రహాల అమరిక, పెర్సీడ్ ఉల్కాపాతాన్ని చూసే ఉత్సాహాన్ని తగ్గిస్తుంది. తాము ప్రత్యక్ష ప్రసారాలపైనే ఆధారపడవలసి ఉంటుందన్నారు.
