1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 13-07-2026 Daily Astrology

13-07-2026 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు...

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లావాదేవీలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. చెల్లింపుల్లో జాప్యం తగదు. కొత్త యత్నాలు మొదలెడతారు. పనులు సానుకూలమవుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలకు తావ్వివద్దు. పొదుపు ధనం గ్రహిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. అనవసర జోక్యం తగదు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొంటారు. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. కొందరి రాక చికాకుపరుస్తుంది. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఫైనాన్స్, చిట్స్ జోలికి పోవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాల్లో అప్రమతంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయం తగదు. పెద్దల సలహా పాటించండి. పనుల్లో జాప్యం, చికాకులు అధికం. కొంతమొత్తం ధనం అందుతుంది. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఓర్పుతో శ్రమించండి. సాయం ఆశించవద్దు. కొత్త యత్నాలు మొదలెడతారు. ఖర్చులు సామాన్యం. ఆత్మీయులకు సాయం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఉత్తేజం కలిగిస్తుంది. ధనలాభం ఉంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. వివాదాస్పద విషయాల్లో మీ జోక్యం లేకుండా చూసుకోండి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ కార్యదీక్ష ప్రముఖులను ఆకట్టుకుంటుంది. పదవులు చేపడతారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఖర్చులు విపరీతం. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. మీ ప్రమేయంతో ఒకరికి మేలు జరుగుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ప్రలోభాలకు లొంగవద్దు. ముఖ్యల ఇంటర్వ్యూ సాధ్యం కాదు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. రుణసమస్య తొలగుతుంది. కొత్తయత్నాలు చేపడతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
గ్రహస్థితి సామాన్యం. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. మీ కష్టం వేరొకరికి కలిసివస్తుంది. ధృఢసంకల్పంతో యత్నం సాగించండి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
నిర్విరామంగా శ్రమిస్తారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. సంకల్పబలంతోనే లక్ష్యం సాధిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. సన్మాన, సంస్మరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. ఆదాయం సంతృప్తికరం. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. పొగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పరిస్థితులు అనుకూలిస్తాయి. సమర్థతను చాటుకుంటారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు తగ్గించుకుంటారు. గృహమరమ్మతులు చేపడతారు. ఆత్మీయుతో ఉల్లాసంగా గడుపుతారు. పత్రాలు అందుతాయి. బెట్టింగుల జోలికి పోవద్దు
About Writer
పి.ప్రసూనా రామన్