సంబంధిత వార్తలు
- 17-07-2026 శుక్రవారం ఫలితాలు - లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి..
- 16-07-2026 గురువారం ఫలితాలు - పరిస్థితులు అనుకూలిస్తాయి
- 15-07-2026 బుధవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి...
- 14-07-2026 మంగళవారం ఫలితాలు (అమావాస్య) - దంపతుల మధ్య అకారణ కలహం
- 13-07-2026 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు...
18-07-2026 శనివారం ఫలితాలు - శ్రీమతి వైఖరిలో మార్పు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహస్థితి బాగుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. కొత్త యత్నాలు మొదలెడతారు. పనులు పురమాయించవద్దు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. మీ సాయంతో ఒకరికి మేలు కలుగుతుంది.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. ఖర్చులు సామాన్యం. పనులు మొండిగా పూర్తిచేస్తారు. మితంగా సంభాషించండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
పరిస్థితులు చక్కబడతాయి. రుణవిముక్తులవుతారు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంభాషిస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి1, ఆశ్లేష
కార్యసిద్ధి ఉంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. మీ కృషి ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. పొదుపునకు అవకాశం లేదు. పనులు మెదలు పెట్టేసరికి అవాంతరాలెదురవుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యపడతాయి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. అపజయాలకు కుంగిపోవద్దు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరునస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. చెల్లింపుల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం సమస్యాత్మకమవుతుంది. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లావాదేవీలతో సతమతమవుతారు. ఆచితూచి అడుగేయాలి. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
విశేష ఫలితాలున్నాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. లక్ష్యం నెరవేరుతుంది. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. అనవసర జోక్యం తగదు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంప్రదింపులు ఫలిస్తాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. రుణ విముక్తులవుతారు. ఖర్చులు అధికం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు సామాన్యం.. పెద్దమొత్తం సాయం తగదు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పనుల ప్రారంభంలో అవాంతరాలెదురవుతాయి. నోటీసులు అందుకుంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. ఆందోళన తగ్గి స్థిమితపడతారు. ధనలాభం ఉంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పనులు వేగవంతమవుతాయి. మితంగా సంభాషించండి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అన్ని విధాలా అనుకూలమే. మీ వాక్కు ఫలిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు సంతృప్తికరం. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పనుల్లో శ్రమ అధికం. పత్రాలు అందుకుంటారు. స్వాగత, వీడ్కోలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణం కలిసివస్తుంది.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పథంతో మెలగండి. స్వయంకృషితో లక్ష్యం సాధిస్తారు. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. పొదుపు ధనం గ్రహిస్తారు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
