1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. TTD To Set Up Emergency Response Team for Safety on Alipiri Footpath

అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతను బలోపేతం.. టీటీడీ ఏర్పాట్లు

Tirumala Lord Sri venkateswra
అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్ణయించింది. ఇందులో భాగంగా సమగ్ర వన్యప్రాణుల నిర్వహణ ప్రణాళికను అమలు చేయడంతో పాటు, ప్రత్యేక అత్యవసర స్పందన బృందాన్ని ఏర్పాటు చేయనుంది.
 
శనివారం నాడు టీటీడీ, అటవీ శాఖ అధికారులతో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సి.హెచ్. వెంకయ్య చౌదరి, భక్తుల భద్రతను కల్పించడంలోనూ, వన్యప్రాణుల కదలికలను సమర్థవంతంగా నియంత్రించడంలోనూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
 
దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి, ట్రెకింగ్ మార్గంలో అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించడానికి, గత కొన్నేళ్లుగా నమోదైన వన్యప్రాణి సంఘటనలపై శాస్త్రీయ విశ్లేషణ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సకాలంలో జోక్యం చేసుకునేందుకు వీలుగా, తిరుమల అడవిలో వన్యప్రాణుల కదలికల సరళిని అధ్యయనం చేయాలని, కీలక ప్రమాద పారామితులను అంచనా వేయాలని, జంతుజాలాన్ని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను కోరారు. 
 
అలిపిరి కాలిబాట వెంబడి ఉన్న దుకాణాలు వన్యప్రాణుల కదలికలకు దోహదపడుతున్నాయో లేదో నిర్ధారించడానికి ఒక అధ్యయనం చేయాలని అదనపు ఈఓ ఆదేశించారు. ఆహార వ్యర్థాల వైపు జంతువులు ఆకర్షితులవకుండా నిరోధించడానికి వ్యర్థాల నిర్వహణను పటిష్టం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
 
అత్యావసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం, నిరంతర పర్యవేక్షణ, సమాచార మార్పిడి కోసం అటవీ, విజిలెన్స్, ఇంజనీరింగ్ మరియు ఆరోగ్య విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంతో పాటు, ప్రమాదకరమైన ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేయాల్సిన అవసరాన్ని చెప్పారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
18-07-2026 శనివారం ఫలితాలు - శ్రీమతి వైఖరిలో మార్పు...