1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 23-07-2026 Daily Astrology

23-07-2026 గురువారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

Daily Horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. ఆశావహదృక్పథంతో శ్రమించండి. మిమ్ములను తక్కువ అంచనా వేసుకోవచ్చు. స్థిరాస్తి ధనం అందుతుంది. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. పత్రాల్లో మార్పులు సాధ్యమవుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లావాదేవీలు కొలిక్కివస్తాయి. ధనలాభం వాహనసౌఖ్యం పొందుతారు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా భావించవద్దు. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్నివిధాలా అనుకూలం. మీ కృషి ఫలిస్తుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. నోటీసులు అందుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు మరింత శ్రమించాలి. అత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోండి. కీలక పత్రాలు అందుతాయి. ప్రయాణం విరమించుకుంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
మీ కష్టం ఫలిస్తుంది. రావలసిన ధనం అందుతుంది. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అందరితో మితంగా సంభాషించండి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. కీలక  సమావేశంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతికూలతలు అధికం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. చిన్న విషయానికి చిరాకుపడతారు. మీ తప్పులు సరిదిద్దుకోవటం ఉత్తమం. రావలసిన ధనం అందుతుంది. అచ్చులు సామాన్యం, ముఖ్యులు కలయిక నీలుపడదు. కార్యక్రమాలు, పనులు వాయిదా పడతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభవార్త వింటారు. ఒక సమస్య మీరు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీదైన రంగంలో రాణిస్తారు. మీ ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవచ్చు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు మెరుగుపడతాయి. కార్యం నెరవేరుతుంది. కొత్త పనులు చేపడతారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. అందరితోను మితంగా సంభాషించండి. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. ఖర్చులు అధికం నగదు. విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. సన్నిహితులలో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. స్థిరచరాస్తులు వ్యవహారంపై దృష్టిపెడతారు. ఏకాగ్రతలో వాహనం నడిపింది.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధి, ధనప్రాప్తి ఉన్నాయి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు అధికం. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఖర్చులు విపరీతం, నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. పనులు హడావుడిగా సాగుతాయి.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
భక్తుల రద్దీ: గురువారం నాటి SSD టోకెన్లను రద్దు చేసిన టీటీడీ