28-07-2026 మంగళవారం ఫలితాలు - అప్రమత్తంగా ఉండాలి.. భేషజాలకు పోవద్దు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అప్రమత్తంగా ఉండాలి. భేషజాలకు పోవద్దు. ఆప్తులకు మీ సమస్య తెలియజేయండి. ఖర్చులు అదుపులో ఉండవు. చేబదుళ్లు స్వీకరిస్తారు. చేస్తున్న పనులపై దృష్టిపెట్టండి. ఉల్లాసంగా గడుపుతారు. కీలక సమావేశంలో పాల్గొంటారు. ఆహ్వానం అందుకుంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శుభవార్త వింటారు. కొన్ని సంఘటనలు అనుకున్నట్టే జరుగుతాయి. కష్టం ఫలిస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడపుతారు. ఖర్చులు ప్రయోజనకరం. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. దంపతుల మధ్య అకారణ కలహం. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. రావలసిన ధనం అందుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లక్ష్యానికి చేరువవుతారు. యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు విపరీతం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. రావలసిన ధనం అందుతుంది. రుణవిముక్తులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ముఖ్యులను కలుసుకుంటారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంకల్పబలంతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అనవసర జోక్యం తగదు ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం అందుతుంది.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. యత్నాలు విరమించుకోవద్దు. మీ శక్తిసామర్ధ్యాలపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం. సన్నిహితులు సాయం అందిస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కుటుంబ సౌఖ్యం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. దుబారా ఖర్చులు విపరీతం. కొత్తపనులు చేపడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలకు తావివ్వవద్దు. పనులు సానుకూలమవుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థిక లాభాలున్నాయి. రావలసిన ధనం అందుతుంది. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. పనులు ముందుకు సాగవు. ఆప్తులతో సంభాషిస్తారు. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. యత్నాలు విరమించుకోవద్దు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను సౌమ్యంగా తెలియజేయండి. పనులు పురమాయించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. రుణసమస్య పరిష్కారమవుతుంది. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. అపరిచితులతో మితంగా సంభాషించండి. కీలక విషయాలు వెల్లడించవద్దు. బెట్టింగ్లకు పాల్పడవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆచితూచి అడుగేయండి. ఆగ్రహావేశాలకు లోనుకావద్దు. మీ తప్పిదాలు సరిదిద్దుకోవటం శ్రేయస్కరం. ఖర్చులు అదుపులో ఉండవు. చేస్తున్న పనులు అర్ధాంతంగా ముగిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.
