1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Nirmal dist : Brain-dead man's organs save lives

బ్రెయిన్ స్ట్రోక్‍తో మృతి చెంది పలువురి జీవితాల్లో వెలుగులు (వీడియో)

braindead
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా వాసి ఒకరు తాను మృతి చెందుతూ అనేక మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్‌ అయిన జిల్లాలోని కడెం మండలం, కొండుకూర్‌కు చెందిన వెంకటేశ్వర రావు అనే వ్యక్తి మరణానంతరం కూడా పలువురికి జీవం కల్పించారు. మృతుని కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించడంతో ఆయన గుండె చప్పుడు ఆగినా మరికొందరి జీవితాల్లో కొత్త ఆశ చిగురింపజేసింది. ఈ మానవతా నిర్ణయానికి యశోద ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సెల్యూట్ చేశారు. ఆవయవదానం ఒక జీవితానికి ముగింపు కాదు. ఎన్నో జీవితాలకు కొత్త ప్రారంభమే సందేశాన్ని ఈ కుటుంబం ఆచరణలో చూపించిందని అనేక మంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

 

About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఆంధ్రా వర్శిటీని వైకాపా కార్యాలయంగా మార్చిన మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి సస్పెండ్