1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 17-02- 2026 Your Daily Horoscope

17-02- 2026 మంగళవారం ఫలితాలు - మీ తప్పిదాలు సరిదిద్దుకోండి

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. ఖర్చులు విపరీతం. ఇతరులకు సాయం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. న్యాయ నిపుణులను సంప్రదిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శ్రమించిన కొద్దీ మంచి ఫలితాలుంటాయి. ఆశావాహదృక్పథంతో మెలగండి. పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. ఖర్చులు విపరీతం. హామీలు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. సవరణలు సాధ్యపడతాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సాయం చేస్తామన్న నాడు వెనుకడుగు వేస్తారు. నిరుత్సాహానికి లోనవుతారు. చిన్న చిన్న ఒత్తిళ్లున్నా మనోవైద్యం కోల్పోవద్దు. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. అవసరాలు అతికష్టంమ్మీద నేరవేరుతాయి. చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యం సిద్ధిస్తుంది. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. లావాదేవీల విషయంలో లౌక్యంగా మెలగండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఖర్చులు అధికం, సంతృప్తికరం, పనులు సానుకూలమవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
విశేష ఫలితాలున్నాయి. అనుకున్న కార్యం సాధిస్తారు. పనుల భాధ్యతలు అప్పగించవద్దు. వాహనం కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త ప్రముఖులను కలుసుకుంటారు. ప్రియతములు గురించి ఆందోళన చెందుతారు. వారితో సంప్రదింపులు జరుపుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పనులు పూర్తి చేస్తారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా పడతాయి. మీ సాయంతో ఒకరి నుంచి జరుగుతుంది. లావాదేవీల్లో మెలకువ వహించింది. ప్రలోభాలకు గురికావద్దు. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ తప్పిదాలు సరిదిద్దుకోండి. ఎవరిని తప్పుపట్టవద్దు. దృఢసంకల్పంలో యత్నాలు సాగించండి. ఖర్చులు విపరీతం, ఇతరులకు సాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. ఒక సమాచారం అందుతుంది. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పధంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. ఖర్చులు తగ్గించుకుంటారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పూర్వ విద్యార్థులు సమావేశంలో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రతికూలతలను అధిగమిస్తారు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. విలాసాలకు ఖర్చు చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. నోటీసులు అందుకుంటారు. సోదరీ సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. మీ కష్టం ఫలిస్తుంది. సమర్థతను చాటుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. నిలిపివేసిన పనులు పునః ప్రారంభిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ఖర్చులు అధికం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. ద్విచక్ర వాహంపై దూరప్రయాణం తగదు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సమస్యలను నిబ్బరంగా ఎదుర్కుంటారు. మీ కార్యదీక్ష ప్రశంనీయమవుతుంది. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త, బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. కొత్తవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. చేపట్టిన పనులు మొండిగా పూర్తిచేస్తారు. ప్రయాణం సజావుగా సాగుతుంది.
తర్వాతి కథనం
ఏఐతో ఇబ్బందులు తప్పవ్.. బాగా వంగా జోస్యం