20-02-2026 శుక్రవారం ఫలితాలు : ఖర్చులు సామాన్యం.. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపుల్లో జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఒత్తిళ్లకు గురికావద్దు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పరిస్థితులు చక్కబడతాయి. ఆర్ధిక సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ఫైనాన్స్, చిట్స్ రంగాల జోలికి పోవద్దు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు.
మిధునం :మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
తప్పటడుగు వేస్తారు. మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి. మీ తప్పిదాలకు ఇతరులను నిందించవద్దు. ధృఢసంకల్పంతో శ్రమించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. నోటీసులు అందుకుంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పనులు అర్థాంతంగా ముగిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఖర్చులు అధికం. ముఖ్యుల కలయిక వీలుపడదు. అప్రియమైన వార్త వింటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రయాణం తలపెడతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు చక్కబడతాయి. చిత్తశుద్ధిని చాటుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. అందరితోను మితంగా సంభాషించండి. వాహనం ఇతరులకివ్వవద్దు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా మంచి ఫలితాలున్నాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం జాగ్రత్త. ఆత్మీయులతో సంభాషిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. ఆశావహదృక్పథంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. ఊహించని ఖర్చులెదురవుతాయి, పనులు ఒక పట్టాన పూర్తికావు. చిన్న విషయానికే అసహనం చెందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యానికి చేరువలో ఉన్నారు. ఆశావహదృక్పథంతో శ్రమించండి. సాయం ఆశించవద్దు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. పెద్దలను సంప్రదిస్తారు. లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యం సిద్ధిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. పరిచయాలు బలపడతాయి. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆర్భాటాలకు విపతంగా ఖర్చుచేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్థాంతంగా ముగిస్తారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
