సంబంధిత వార్తలు
- 17-02- 2026 మంగళవారం ఫలితాలు - మీ తప్పిదాలు సరిదిద్దుకోండి
- 16-02-2026 సోమవారం ఫలితాలు - మాటతీరుతో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు...
- 15-02-2026 ఆదివారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు
- 14-02-2026 శనివారం ఫలితాలు - పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు....
- 13-02-2026 శుక్రవారం ఫలితాలు - పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తి చేస్తారు...
18-02-2026 బుధవారం ఫలితాలు - ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు....
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంతోషకరమైన వింటారు. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ చిత్తశుద్ధి ప్రశంసనీయమవుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మితంగా సంభాషించండి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కుంటారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. ఖర్చులు విపరీతం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. లావాదేవీలతో తీరిక ఉండదు. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. స్థల వివాదాలు పరిష్కారమవుతాయి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. పెద్దలను సంప్రదించండి. మీదైన రంగంలో ఒత్తిడికి గురికావద్దు. ఖర్చులు అధికం, నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు మరింత శ్రమించాలి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఖర్చులు విపరీతం. మితంగా సంభాషించండి. మీ మాటలు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. మీ శ్రీమతి తీరులో మార్పు వస్తుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యం సాధిస్తారు. ఏకాగ్రత తగ్గకుండా శ్రమించండి. యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తిధనం అందుతుంది. తాకట్టు విడిపించుకుంటారు. ఆర్ధిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్ళకు గురికావద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆచితూచి అడుగేయండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. భేషజాలకు పోవద్దు. చేపట్టిన పనుల్లో శ్రమ, చికాకులు అధికం. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించుకోండి. అనవసర జోక్యం తగదు. కొత్తయత్నాలు మొదలెడతారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ఖర్చులు అధికం. ఆప్తులకు సాయం చేస్తారు. తలపెట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఆర్థిక వివరాలు గోప్యంగా ఉంచండి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. ఇబ్బందులు ఎదురైనా యత్నాలు సాగించండి. మనోధైర్యంతో శ్రమిస్తే విజయం తధ్యం. ఆపత్సమయంలో ఆప్తులు సాయం చేస్తారు. ఖర్చులు తగ్గించుకుంటారు. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణం తలపెడతారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆచితూచి అడుగేయాల్సిన సమయం. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓర్పుతో శ్రమించిన గాని పనులు పూర్తికావు. ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో సంభాషిస్తారు. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. చిన్నవిషయానికే చికాకుపడతారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లావాదేవీలు ముగుస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. రుణసమస్య పరిష్కారమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. లక్ష్యం సాధిస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. అందరితోను మితంగా సంభాషించండి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పరిచయస్తుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ కష్టం వృధా కాదు. కొంతమొత్తం పొదుపు చేస్తారు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు.
