1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 02-06-2026 Daily Astrology

02-06-2026 మంగళవారం ఫలితాలు - రుణసమస్యలు తొలగుతాయి

Daily Astrology
Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఖర్చులు విపరీతం, అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రావలసిన ధనం అందుతుంది. రుణసమస్యలు తొలగుతాయి. ఖర్చులు అధికం. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పనులు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనం ఏకాగ్రతతో నడపండి. నిందుకు హాజరవుతారు. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, అర్ధ, పునర్వసు 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. మీ విజ్ఞతకు ప్రశంసలు లభిస్తాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు ధనసహాయం అందిస్తారు. సన్మాన సభల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీదైన రంగంలో రాణిస్తారు. ముఖ్యులతో పరిచయాలేర్పడతాయి. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రణాళికాబద్ధంగా పనులు సిద్ధం చేసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. మనోధైర్యంతో అడుగు ముందుకేయండి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు సాగవు. దంపతుల మధ్య చీటికిమాటికి కలహాలు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కొంతమేరకు అనుకూలమే. పరిస్థితులు చక్కబడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం అందుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి తీరును గమనించి మెలగండి. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఖర్చులు ప్రయోజనకరం. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వస్త్రప్రాప్తి, కుటుంబ సౌఖ్యం ఉన్నాయి. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సర్వత్రా అనుకూలమే. ప్రముఖులను ఆకట్టుకుంటారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. విలాసాలకు ఖర్చు చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పనుల్లో శ్రమ, చికాకులు అధికం ప్రయాణం తలపెడతారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు చేరువవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు వేగవంతమవుతాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్ని సమస్యగా భావించవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఖర్చులు విపరీతం. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. వేడుకకు హాజరుకాలేదు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. మీదైన రంగంలో రాణిస్తారు. రావలసిన ధనం అందుతుంది. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. పెట్టుబడులు అనుకూలించవు. పనులు సానుకూలమవుతాయి. మీ చిత్తశుద్ధిని కొంతమంది శంకిస్తారు. మనోధైర్యంతో మెలగండి.
About Writer
పి.ప్రసూనా రామన్