సంబంధిత వార్తలు
- Mahesh Babu :మహేష్ బాబు 1: నేనొక్కడినే 4K ఫార్మెట్ లో వారణాసిలో ముందస్తు షోలు
- ఫాస్టర్ కాదు కిరాతకుడు.. మైనర్ బాలికపై అత్యాచారం.. గర్భనిరోధక మందులిచ్చి...?
- ప్రేమ వివాహం చేసుకున్న జంటపై యువతి తల్లిదండ్రుల దాడి.. కుమార్తె కిడ్నాప్
- Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లోని మూడు కోర్టులకు బాంబు బెదిరింపులు
- యువతిని ప్రేమించి పెళ్లాడాడని స్తంభానికి కట్టేసి కొట్టారు
ఏలూరులో దారుణం.. ఇద్దరు వృద్ధ మహిళల సజీవదహనం
ఏపీలోని ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు వృద్ధ మహిళలు సజీవదహనమయ్యారు. వేలేరుపాడు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఒక ఇంట్ల మంటలు చెలరేగడంతో ఇద్దరు వృద్ధులు కాలిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
స్థానికుల కథనం మేరకు... వలగని సావిత్రి (60), పూలమ్మ (65) అనే ఇద్దరు మహిళలు ప్రమాద సమయంలో ఇంట్లోనే నిద్రిస్తున్నారు. ఇంట్లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా వేగంగా వ్యాపించడంతో వారు బయటకు రాలేకపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో ఒకరైన పూలమ్మ తెలంగాణాలోని సూర్యాపేట నివాసి. ఆమె తన సోదరి సావిత్రి ఇంటికి చుట్టపు చూపుగా వచ్చారు. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలి బూడిదైంది. మంటల తీవ్రతకు పక్కనే ఉన్న మరో ఇంటికి కూడా నష్టం వాటిల్లింది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్న మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదవశాత్తు మంటల చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే, పమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాతు తెలియాల్సివుంది.
