1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 31-05-2025 Daily Astrology

31-05-2026 ఆదివారం ఫలితాలు - ఖర్చులు విపరీతం.. చేతిలో ధనం నిలవదు...

Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అనుకూల ఫలితాలున్నాయి. వ్యవహారపరిజ్ఞానంతో రాణిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ముఖ్యమైన సమావేశంలో పాల్గొంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణసమస్య పరిష్కారమవుతుంది. ఖర్చులు సామాన్యం. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పనులు స్థిమితంగా పూర్తిచేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
స్థిరచరాస్తి ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులతో సంప్రదిస్తా చేపట్టిన పనులు సాగవు. అనవసర జోక్యం తగదు. పాతమిత్రులు తారసపడతారు. వివాహయత్నం ఫలిస్తుంది. దైవకార్యంలో పాల్గొంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లక్ష్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. మనోధైర్యంతో యత్నాలు కొనసాగించండి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆప్తుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఒకేసారి అనేక పనులతో సతమతమవుతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు ముగుస్తాయి. వ్యవహారానుకూలత ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
దృఢసంకల్పంతో ముందుకు సాగుతారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ కృషి ఫలిస్తుంది. విజ్ఞతతో అందరినీ ఆకట్టుకుంటారు. పెద్దఖర్చు తగులుతుంది. కష్టమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
నేడు అనుకూలదాయకం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెద్దమొత్తం సాయం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. అనవసర జోక్యం తగదు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారజయం, ధనలాభం ఉన్నాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. ఆచితూచి అడుగేయాలి. ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞులను సంద్రించండి. ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. సోదరులతో సంభాషిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తగవు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆశావహదృక్పథంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. యత్నాలు కొనసాగించండి. ఖర్చులు అదుపులో ఉండవు. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. చేసిన పనులే చేయవవలసి వస్తుంది. కుటుంబీకులు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. ఓర్పుతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. వ్యతిరేకులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆశించిన ఫలితాలున్నాయి. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. రుణసమస్య పరిష్కారమవుతుంది. మానసికంగా స్థిమితపడతారు. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. 
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...