25-02-06 బుధవారం ఫలితాలు - రుణ సమస్య తొలగుతుంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సర్వం శుభదాయకం. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. న్యాయ నిపుణులను సంప్రదిస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సకాలంలో సమలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. కొత్తయత్నాలు చేపడతారు. ఆరోగ్యం జాగ్రత్త
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. కష్టమయకున్న పసులు తేలికగా పూర్తవుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
విశేష ఫలితాలున్నాయి. ధనలాభం ఉంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహయత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. సకాలంలో పరులు పూర్తి చేస్తారు. అనవవసర జోక్యం తగదు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రియతముల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు అంతంత మాత్రమే నిరుత్సాహపడవద్దు. మీ కృషి' త్వరలో ఫలిస్తుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ముఖ్యమైన వ్యవహారంలో శ్రద్ధ వహించండి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు గురికావద్దు. ఊహించని ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. సన్నిహితుల కలయిక వీలుపడదు. చీటికిమాటికి అసహనం చెందుతారు. వేడుకకు హాజరవుతారు. ఇంటిని అలక్ష్యంగా వదిలి వెళ్లకండి. నగదు, బంగారం జాగ్రత్త.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అలక్ష్యంగా గడుపుతారు. కొత్త పనులు చేపడతారు. వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయం తగదు. పెద్దల సలహా పాటించండి, ముఖ్యుల కలయిక వీలుపడదు. మొండిగా యత్నాలు సాగిస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పనులు క్రియారూపం దాటుతాయి. ముఖ్యమైన అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రముఖంతో పరిచేయాలేర్పడతాయి. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసాధనకు చేరువలో ఉన్నారు. యత్నాలు విరమించుకోవద్దు. పెద్దల వ్యాఖ్యలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. పనులు, బాధ్యతలు ఇతరులకు పురమాయించవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. పత్రాలు అందుకుంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
రుణసమస్య తొలగుతుంది. మానసికంగా కురుటపడతారు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. చేస్తున్న పనులు అర్థాంతంగా ముగిస్తారు. అనవసర జోక్యం తగదు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. కొన్ని విషయాలు ఊహించినట్లే జరుగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడివడి ఉంటుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆశావహదృక్పధంతో యత్నాలు సాగించండి. అవకాశాన్ని వదులుకోవద్దు. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఖర్చులు విపరీతం. పనులు పురమాయించవద్దు సన్నిహితులను కలుసుకుంటారు.
