నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ హత్య.. విద్యార్థులే హంతకులు.. రూ.4లక్షల కోసమే చంపేశారా?
Rupa Reddy
వీరు ముగ్గురు ప్రిన్సిపాల్ ఇంట్లోకి చొరబడి కత్తులతో పొడిచి ప్రిన్సిపాల్‌ను హత్య చేశారు. వేలిముద్రలు పడకుండా ఉండేందుకు నిందితులు గ్లౌజులు ధరించారుని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సుమారు 80 మందిని పోలీసులు విచారించారు.
రూ.4 లక్షల నగదు కోసమే ఈ హత్య జరిగిందా? లేకుంటే ఈ హత్యకు వేరైదైనా కారణం వుందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇబ్రహీంపట్నం సమీపంలో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
