1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Predatory Principal in Nagarkurnool District Principal Sexual Harassment in Nagar Kurnool District

విద్యార్థినిపై ప్రిన్సిపల్ లైంగిక దాడి - ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్టును కొరికిన విద్యార్థిని (వీడియో)

Harassment
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో ఓ దారుణం జరిగింది. తన వద్ద చదువుకునే విద్యార్థినిపై ప్రిన్సిపల్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతని చిత్ర హింసలు భరించలేని ఆ విద్యార్థిని... ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్టును కొరికేసింది. దీంతో ఆయన బిగ్గరగా కేకలు వేస్తూ గది నుంచి నగ్నంగా పరుగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని ఓ పీజీ కాలేజీలో మార్క్ పోలోనియస్ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. అయితే, 2025లో పీజీ పూర్తి చేసిన తనకు టీసీ ఇవ్వాలని ఓ విద్యార్థిని కోరింది. దీంతో తన ఇంటికి వస్తే ఇస్తానని ప్రిన్సిపాల్ చెప్పాడు. దీంతో విద్యార్థిని తన స్నేహితురాలిని తోడుగా తీసుకుని ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్లింది. అపుడు సమయం రాత్రి పది గంటలు కావడంతో విద్యార్థినిని గదిలోకి తీసుకెళ్లిన ప్రిన్సిపాల్ లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
ఈ క్రమంలో కామాంధుడైన ప్రిన్సిపల్ ఆ విద్యార్థిని చిత్రహింసలకు గురిచేశాడు. వీటిని భరించలేని బాధితురాలు ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్టును కొరికేసింది. దీంతో బిగ్గరగా కేకలు వేస్తూ గది నుంచి నగ్నంగా ప్రిన్సిపల్ బయటకు వచ్చాడు. అలాగే, విద్యార్థిని నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు.. ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. 

 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ - గోల్డీపై అమెరికాలో కేసు : 50 వేల డాలర్ల రివార్డు